Sunday, November 16, 2025
Homeనేషనల్Russian Crude Oil: ట్రంప్ కన్నెర్ర.. రష్యా చమురుపై తగ్గేదేలే అన్న భారత్!

Russian Crude Oil: ట్రంప్ కన్నెర్ర.. రష్యా చమురుపై తగ్గేదేలే అన్న భారత్!

Russian Crude Oil: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలకు భారత్ భయపడిందా..? రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపివేస్తుందా..? ఈ ప్రశ్నలకు తెరదించుతూ భారత చమురు సంస్థలు గట్టి సమాధానం ఇచ్చాయి. మాకు దేశ ప్రయోజనాలే ముఖ్యం, ఆర్థిక సమీకరణాలే ఆధారం తప్ప, ఎవరి హెచ్చరికలకో తలొగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాయి. ఇంతకీ, ట్రంప్ ఆగ్రహానికి కారణమేంటి..? భారత ప్రభుత్వ రంగ సంస్థలు ఇంత ధైర్యంగా సమాధానం ఇవ్వడం వెనుక ఉన్న వ్యూహమేమిటి..?

- Advertisement -

రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల సుంకాలు విధించినా, భారత్ మాత్రం వెనకడుగు వేయలేదు. ఈ విషయంలో తమ వైఖరి స్పష్టంగా ఉందని, కేవలం ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే మాస్కో నుంచి కొనుగోళ్లు కొనసాగిస్తామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ఛైర్మన్ ఏఎస్ సాహ్నీ కుండబద్దలు కొట్టారు.

“ఆర్థిక ప్రయోజనాలే మాకు ముఖ్యం” :  అమెరికా సుంకాల నేపథ్యంలో, రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించాలని గానీ, పెంచాలని గానీ తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదని సాహ్నీ స్పష్టం చేశారు.

READ ALSO: https://teluguprabha.net/national-news/kerala-first-fully-digital-literate-state-india-digi-keralam/

“చమురు దిగుమతులపై ఎటువంటి నిలుపుదల లేదు, మా వ్యాపారం యథావిధిగా కొనసాగుతోంది. రష్యా ముడి చమురుపై ఎలాంటి ఆంక్షలు లేవు, ఆ ఆంక్షలను ఉల్లంఘించే పని భారత్ చేయడం లేదు. అమెరికా నుంచి ఎక్కువ కొనమని, లేదా ఇతర దేశాల నుంచి తక్కువ కొనమని మమ్మల్ని ఎవరూ అడగలేదు. కేవలం ఆర్థిక అంశాలే మా కార్యకలాపాలను నిర్దేశిస్తాయి.”
– ఏఎస్ సాహ్నీ, ఛైర్మన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్

ఇదే విషయాన్ని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) డైరెక్టర్ (ఫైనాన్స్) రామకృష్ణ గుప్తా కూడా బలపరిచారు. గత నెలలో రష్యా నుంచి దిగుమతులు తగ్గడానికి కారణం అమెరికా ఒత్తిడి కాదని, కేవలం రష్యా ఇచ్చే డిస్కౌంట్లు తగ్గడమేనని ఆయన స్పష్టత ఇచ్చారు. దీన్ని బట్టి, ఏ దేశం తక్కువ ధరకు చమురును అందిస్తే, ఆ దేశం నుంచే భారత్ కొనుగోలు చేస్తుందనే విధానం సుస్పష్టమవుతోంది.

READ ALSO: https://teluguprabha.net/national-news/delhi-high-court-ruling-on-love-marriage-protection-article-21/

మారిన సమీకరణాలు : మూడేళ్ల క్రితం ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రారంభం కాకముందు, భారత్ తన మొత్తం చమురు అవసరాల్లో ఒక శాతం కన్నా తక్కువే రష్యా నుంచి దిగుమతి చేసుకునేది. అయితే, యుద్ధం కారణంగా పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడంతో, మాస్కో తన ముడి చమురును తక్కువ ధరలకే విక్రయించడం ప్రారంభించింది. ఈ అవకాశాన్ని భారత్ అందిపుచ్చుకుంది. తన కొనుగోళ్లను గణనీయంగా పెంచి, ప్రస్తుతం దేశీయ అవసరాల్లో ఏకంగా 30 శాతాన్ని రష్యా నుంచే దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో, దేశ ఇంధన భద్రత, ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపే ప్రసక్తే లేదని భారత్ పరోక్షంగా తేల్చిచెప్పింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad