భారత ఆర్మీ(Indian Army) చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్'(Operation Sindoor)కు ప్రతిగా భారత్‌పై పాక్ సైన్యం దాడులకు తెగబడుతోంది. సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్ల దాడితో పాటు నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరుపుతోంది. వీటిని భారత బలగాలు సమర్థంగా తిప్పికొడుతున్నాయి. ఈక్రమంలోనే సరిహద్దుల్లో దాయాది దేశానికి చెందిన పలు సైనిక పోస్టులను ధ్వంసం చేశాయి. ఇందుకు సంబంధించిన వీడియోను భారత సైన్యం విడుదల చేసింది.
- Advertisement -
యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైళ్లతో జరిపిన దాడిలో పాక్ సైనిక స్థావరం కుప్పకూలిన దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఏ సెక్టార్‌లోని పోస్ట్‌ను నేలకూల్చారన్నది మాత్రం తెలియరాలేదు.