Indian Railway Emergency Quota: భారత రైల్వే శాఖ ఇదివరకే తత్కాల్ బుకింగ్ నియమాలను మార్చింది. మార్చబడిన నియమాలు జూలై 1 నుండి అమలులోకి వచ్చాయి. ఇపుడు కొత్తగా మరో మార్పు తీసుకువచ్చింది భారత రైల్వే. ఈ మార్పు ఎమర్జెన్సీ కోటా నియమాలలో జరిగింది. ఈ ఇండియన్ రైల్వే ఎమర్జెన్సీ కోటా.. వీఐపీలు, రైల్వే అధికారులు, సీనియర్ బ్యూరోక్రాట్లు, వివిధ ప్రభుత్వ శాఖల వారికి అందుబాటులో ఉంటుంది.
రైల్వే మంత్రిత్వ శాఖ ఎమర్జెన్సీ కోటా నియమాలలో సవరణలు ప్రకటించింది. ఇప్పటి వరకు ఎమర్జెన్సీ కోటా కోసం కొన్ని రోజుల ముందు నుండే అభ్యర్థనలు స్వీకరించారు. ఇకపై ఎమర్జెన్సీ కోటా కోసం అభ్యర్థనలు రైలు బయలుదేరే ముందు రోజు మాత్రమే సమర్పించాలని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
Readmore:https://teluguprabha.net/national-news/these-people-are-in-race-for-vice-president-role/
దీని గురించి రైల్వే మంత్రిత్వ శాఖచే జారీ చేయబడిన సర్క్యూలర్ లో ఈ విధంగా ఉంది. ఉదయం 12 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య బయలుదేరే రైళ్ల కోసం ఎమర్జెన్సీ కోటా అభ్యర్థనలు ముందు రోజు మధ్యాహ్నం 12 గంటలలోపు రైల్వే ఎమర్జెన్సీ కోటా సెల్‌కు చేరుకుని తెలపాలి. అలాగే మధ్యాహ్నం 2:01 గంటల నుంచి రాత్రి 11:59 గంటల మధ్య బయలుదేరే రైళ్ల కోసం అభ్యర్థనలు ముందు రోజు సాయంత్రం 4 గంటలలోపు సమర్పించాలని తెలిపింది.
కానీ రైలు బయలుదేరే రోజున ఎలాంటి అభ్యర్థనలు స్వీకరించబడవని సర్క్యూలర్ ద్వారా రైల్వే శాఖ ప్రకటించింది. రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ప్రక్రియని మరింత కఠినతరం చేసింది. ఇక సెలవు దినాల్లో లేదా ఆదివారాల సమయాల్లో బయలు దేరే రైళ్ల కోసం చివరి పని రోజుల్లో అభ్యర్థనలను సమర్పించాలి అని రైల్వే శాఖ తెలిపింది.
Readmore: https://teluguprabha.net/national-news/iaf-mig-21-retirement-september-2025/
ఇటీవల మార్చబడిన రిజర్వేషన్ చార్ట్ సమయానికి అనుగుణంగా ఎమర్జెన్సీ కోటా అభ్యర్థనల సమయాన్ని మార్చారు. రిజర్వేషన్ చార్ట్ ఇదివరకు నాలుగు గంటల ముందు సిద్ధం చేస్తే.. ప్రస్తుతం ఎనిమిది గంటల ముందు సిద్ధం చేస్తున్నారు. ఎమర్జెన్సీ కోటా అభ్యర్థనలు సమర్పించే అధికారులు, అభ్యర్థి ప్రామాణికతను నిర్ధారించాలని, నియమాలను ఖచ్చితంగా పాటించాలని రైల్వే శాఖ సూచించింది.


