ఇస్రో మాజీ చైర్మన్ డా. కృష్ణస్వామి కస్తూరి రంగన్ (Kasturi Rangan) కన్నుమూశారు. బెంగళూరులో తన స్వగృహంలో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. ఆయన భౌతికకాయాన్ని బెంగళూరులోని రామన్ పరిశోధనా సంస్థలో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు.
- Advertisement -
కస్తూరి రంగన్ 1990-1994 వరకు యూఆర్‌ఎసీ డైరెక్టర్‌గా పనిచేశారు. అనంతరం 1994-2003 మధ్య 9 ఏళ్ల పాటు ఇస్రో ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన హయాంలోనే ఇస్రో తొలి లూనార్ మిషన్‌కు అడుగులు పడ్డాయి. అలాగే జేఎన్‌యూ వైఎస్ ఛాన్సలర్‌గా, కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ చైర్మన్‌గా కూడా వ్యవహరించారు. 2003-2009 వరకు రాజ్యసభ ఎంపీగా కొనసాగారు. ఇక మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా పనిచేశారు.