Jharkhand Results | జార్ఖండ్ 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 24 ఏళ్ళ రికార్డును బ్రేక్ చేసేలా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కొనసాగుతున్న ట్రెండ్ చూస్తుంటే ఇండి అలయన్స్ 48 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. హేమంత్ సోరెన్ మరోసారి సీఎం కుర్చీని చేజిక్కించుకునేలా ఉన్నారు. గత 24 ఏళ్లలో ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. కానీ వరుసగా రెండోసారి ఇండి అలయన్స్ సారధ్యంలోని ముక్తి మోర్చా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లాంఛనంగా కనిపిస్తోంది.
కాగా 81 మంది సభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మ్యాజిక్ ఫిగర్ 41 రావాల్సి ఉంది. ఇండి అలయన్స్ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసి 48 స్థానాల్లో మెజారిటీలో ఉంది. ఇక ఎన్డీయే కూటమి 32 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు ఒక్క స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.