Friday, November 22, 2024
Homeనేషనల్JK: మరో జోషిమఠ్.. ఈసారి జమ్ము-కశ్మీర్ లో

JK: మరో జోషిమఠ్.. ఈసారి జమ్ము-కశ్మీర్ లో

జమ్మూ-కశ్మీర్ లోని దోడా జిల్లాలో మరో జోషిమఠ్ లాంటి ఊరు ఉందనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే నయీ బస్తి అనే ఈ గ్రామంలో 20కి పైగా ఇళ్లలో, స్థానికంగా ఉన్న మసీదుకు బీటలు వారాయి. ఈ ఊరు కూడా క్రమంగా కుంచించుకు పోతోంది. దీంతో ప్రాణాలు అరచేత పట్టుకుని స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. రంగంలోకి దిగిన అధికారులు బీటలు వారిన ఇళ్ల నుంచి ఖాళీలు చేయిస్తూ, సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తున్నారు.

- Advertisement -

ఈ పరిస్థితికి కారణాలు అన్వేషించాలంటూ నిపుణుల బృందాన్ని ఇప్పటికే పంపారు. నయీ బస్తీ గ్రామం తాథ్రి మునిసిపల్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ 50 ఇళ్లు ఉన్నాయి. కొండ ప్రాంతమైన ఇక్కడి గ్రామంలో భవన నిర్మాణాలు, నీటి సదుపాయాల కోసం తవ్వకాలు జరపటం వంటివన్నీ ఇలాంటి పగుళ్లకు దారి తీసి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News