ఉత్తరాఖండ్ లో బీటలు వారి, శిథిలాల అంచుకు చేరుకుంటున్న జోషిమఠ్ సింకింగ్ జోన్ అంటూ సర్కారు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే 60 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికార గణం. నాలుగైదు రిలీఫ్ సెంటర్లను ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం హిమాలయ పట్టణమైన జోషిమఠ్ పరమపవిత్రమైన మఠంగా భావిస్తారు. గర్వాల్ ప్రాంతంలోని ఈ పట్టణం కుంగుబాటుకు గురై అత్యంత ప్రమాదకర స్థితికి చేరుకుంటోంది. ఇప్పటికే ఛమోలీ జిల్లా కలెక్టర్ హిమాన్షు ఖురానా గడప గడపకు వెళ్లి స్థానికులను కలుస్తున్నారు. చీలికలు వచ్చిన భవనాల్లో ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించటంలో కలెక్టర్ బృందం నిమగ్నమై ఉంది.
జోషిమఠ్ లో 4,500 భవనాలుండగా వీటిలో 610 భవనాలకు చీలికలు వచ్చాయి. వీటిలో నివసిస్తున్న వారు ప్రాణాలు అరచేత పట్టుకుని బిక్కుబిక్కుమంటూ నివసిస్తున్నారు. మొత్తం సహాయక చర్యలను ప్రధానమంత్రి కార్యాలయం స్వయంగా పర్యవేక్షిస్తోంది.