కేంద్రం ఆగడాలు, అరాచకాలు మితిమీరిపోతున్నాయని కేసీఆర్ మండిపడ్డారు. ప్రగతి భవన్‌లో ఢిల్లీ, పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్‌తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. రకరకాల దాడులు చేస్తూ బెదిరిస్తున్నారు. అనేక దుర్మార్గాలకు పాల్పడుతోంది కేంద్రం. ఇటీవలి కాలంలో ఢిల్లీలో రెండు వింత సంఘటనలు చూశారు. ఆప్ చాలా పాపులర్ పార్టీ. ఇది దేశానికి, ప్రపంచానికి తెలుసు. కేజ్రీవాల్ నాయకత్వంలో సామాజిక ఉద్యమం ద్వారా వచ్చిన పార్టీ. ఒక్కసారి, రెండు సార్లు కాదు.. మూడు సార్లు అద్భుతమైన విజయం సాధించింది. ఈ మధ్యకాంలో వింత సంఘటన చూశాం. ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. స్పస్టమైన ఆధిక్యంతో ఆప్ విజయం సాధించింది. కానీ బీజేపీ ఎన్నో రకాలుగా, కుయుక్తులు చేసినా ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారు. మేయర్‌ను ప్రమాణస్వీకారం చేసేందుకు ముప్పుతిప్పలు పెట్టారు. సుప్రీంకోర్టు ఆర్డర్ తర్వాత ప్రమాణం చేయాల్సి వచ్చింది. కేజ్రీవాల్ మూడుసార్లు కూడా రెండు జాతీయ పార్టీలను మట్టికరిపించి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారు అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. . ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు వస్తున్నాయి. ఎమర్జెన్సీని వ్యతిరేకించే బీజేపీ నేతలు కూడా ఇప్పుడు అదే చేస్తున్నారు. ఇందిరా గాంధీ అమలు చేసిన ఎమర్జెన్సీ దిశగా కేంద్రంలోని బీజేపీ వెళ్తోంది. బీజేపీకి ఢిల్లీ ప్రజలు మరోసారి తగిన బుద్ధి చెబుతారు. కేంద్ర ప్రభుత్వం ఒక రకంగా ఢిల్లీ ప్రజలను అవమానిస్తోందని కేసీఆర్ మండిపడ్డారు.