మహారాష్ట్ర లోని నాందేడ్ లో బీఆర్ ఎస్ ఆధ్వర్యంలో సభలో పాల్గొనటానికి వెళ్లిన సీఎం కేసీఆర్ ఇక్కడి చారిత్రాత్మక గురుద్వారాలో కేసీఆర్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సీఎం కేసీఆర్ కు నాందేడ్ గురుద్వారాలోని సిక్కు మత గురువులు ఘనస్వాగతం పలికారు. నాందేడ్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న గురుగోవింద్ సింగ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బీఆర్ ఎస్ చేరిక సభను ఘనంగా ఏర్పాటు చేశారు. కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కూడా గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.




