Friday, September 20, 2024
Homeనేషనల్Kerala: సీఎం అయ్యేందుకు రెడీ-శశి థరూర్

Kerala: సీఎం అయ్యేందుకు రెడీ-శశి థరూర్

తాను ముఖ్యమంత్రి అయ్యేందుకు రెడీగా ఉన్నాని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కేరళ జనాలు కోరుకుంటే తాను సీఎం అయ్యేందుకు సై అన్నారు థరూర్. ఈ విషయాన్ని ప్రజలు నిర్ణయించాలని, ప్రజలదే అంతిమ తీర్పు అని ఆయన అనటం విశేషం. కేరళ ప్రజల సాధక బాధకాలు తమకు తెలుసని, తామే అన్ని పరిష్కరించగలమని ఆయన అన్నారు. మరోవైపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్టు పరోక్షంగా శశిథరూర్ హింట్ ఇవ్వటం హైలైట్. దీనిపై మరో రెండు వారాల్లో తాను ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు ఆయన వెల్లడించారు. కేరళ రాజకీయాల్లో కనీసం స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం లేకుండా రాష్ట్ర రాజకీయాలు మారిపోయాయని, కనీసం తమాషాగా మాట్లాడితే కూడా సహచర నేతలు భరించలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News