Sunday, November 16, 2025
Homeనేషనల్Lashkar-e-Taiba: 'పహల్గామ్'లా మరో దాడి.. మోదీకి లష్కరే తోయిబా హెచ్చరిక!

Lashkar-e-Taiba: ‘పహల్గామ్’లా మరో దాడి.. మోదీకి లష్కరే తోయిబా హెచ్చరిక!

Lashkar-e-Taiba comments on PM Modi: పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా భారత ప్రధానమంత్రిని బెదిరిస్తూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. లష్కరే డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరీ ప్రధాని మోదీకి వార్నింగ్ ఇస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

- Advertisement -

సింధు జలాల ఒప్పందంపై ఆరోపణలు: భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాకిస్థాన్‌లో వరదలు వచ్చాయని కసూరీ ఆరోపించాడు. భారత్ వాటర్ టెర్రరిజమ్‌కు పాల్పడుతోందని ఆయన అన్నాడు. ఉద్దేశపూర్వకంగా నీటిని విడుదల చేసి పాక్‌లో వరదలు వచ్చేలా చేస్తోందని ఆరోపించాడు. దీంతో భారత ప్రధానికి గుణపాఠం చెప్పే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని.. పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌ను తాను అభ్యర్థిస్తున్నట్లు కసూరీ పేర్కొన్నాడు.

పాక్ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం: ప్రస్తుతం ఈ వీడియో పాక్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతుంది. కసూరీ వరద ప్రాంతాల్లో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తున్నాడు. ఇటీవల పాకిస్థాన్ వ్యాప్తంగా సంభవించిన వరదలకు భారతే కారణమని ఆయన ఆరోపించాడు. దానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఈ ఉగ్రవాది వీడియోలో మాట్లాడుతున్నాడు. మే 10, 2025 (పహల్గామ్ అటాక్) లాగా ప్రధాని మోదీకి మరో పాఠం చెప్పాలని పాక్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌ను వేడుకుంటున్నట్లు కసూరీ తెలిపాడు.

ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్థాన్: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఈ చర్య అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా దీనిని యుద్ధ చర్యగా పరిగణిస్తామని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గతంలో పేర్కొన్నారు. భారత్ ఈ ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad