Maharashtra Doctor Suicide: మహారాష్ట్రలోని సతారా జిల్లాలో వైద్యురాలి ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పటికే ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తాను ఆత్మహత్య చేసుకునే ముందు రాసిన 4 పేజీల లేఖ ఇప్పుడు వైరల్ అవుతోంది. సబ్ ఇన్‌స్పెక్టర్ గోపాల్ బద్నే తనను తీవ్ర మానసిక, శారీరక హింసకు గురి చేశాడని.. దాదాపు 5 నెలల పాటు తీవ్ర మనోవేదనకు గురైనట్లు ఆమె లేఖలో పేర్కొంది. దీంతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె సూసైడ్ లెటర్ రాసింది.
సీఐ గోపాల్ బద్నే తనపై ఐదు నెలల్లో నాలుగుసార్లు అత్యాచారం చేశాడని లేఖలో వెల్లడించింది. అంతే కాకుండా ఓ ఎంపీ తనను ఫేక్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల కోసం తీవ్రంగా ఒత్తిడి చేశాడని ఆరోపించింది. వీరిద్దరి కారణంగానే తనువు చాలిస్తున్నట్లు ఆమె వివరించింది. సీఐ బద్నే పలువురు నిందితులను వైద్య పరీక్షల నిమిత్తం తీసుకువచ్చి వారు ఫిట్‌గా లేకున్న సర్టిఫికేట్స్ జారీ చేయమని ఒత్తిడి తెచ్చాడని వెల్లడించింది. అంతేకాకుండా కొన్ని సమయాల్లో నిందితులు లేకుండానే సర్టిఫికేట్ల మంజూరుకి డిమాండ్ చేసేవాడని లేఖలో వివరించింది.
Also Read: Bus Accident: బస్సు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం.. కలెక్టర్ కీలక ప్రకటన
సీఐ, ఎంపీ ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొంది. సదరు సీఐపై డీఎస్పీకి కంప్లైంట్ చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని లేఖలో తెలిపింది. చివరకు చేసేదేమి లేక తీవ్ర బాధలో ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు.
ఈ ఘటనపై ఇప్పటికే స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అంశాన్ని ప్రభుత్వం, ఆరోగ్య శాఖ తీవ్రంగా గమనిస్తోంది. ఇలాంటి దారుణ ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేసింది. బాధితురాలికి న్యాయం కల్పించడం కోసం అవసరమైన అన్ని చర్యలు చేపట్టడం అవసరం అని సామాజిక వర్గాలు, రాజకీయ నేతలు పేర్కొంటున్నారు.
Also Read: Kurnool Bus Accident: కర్నూలు ప్రైవేట్ బస్సు దగ్ధం ఘటన.. బైక్ నడిపింది ఇతనే.!
ఇక వైద్యురాలి ఆత్మహత్యపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సీరియస్ అయ్యారు. ఆయన ఆదేశాలతో గోపాల్ బద్నే సస్పెన్షన్ చేశారు. బాధిత వైద్యురాలు ఫల్తాన్ సబ్-డిస్ట్రిక్ట్ ఆసుపత్రిలో వైద్య అధికారిగా పనిచేసింది.


