Thursday, December 5, 2024
Homeనేషనల్Maharastra: ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్‌ను కలిసిన మహాయుతి నేతలు

Maharastra: ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్‌ను కలిసిన మహాయుతి నేతలు

Maharastra| మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబైలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను మహాయుతి కూటమి నేతలు కలిశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్, తదితర నేతలు కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన ఫడ్నవీస్.. ఎమ్మెల్యేల సంతకాల పత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు.

- Advertisement -

కాగా రేపు(గురువారం) సాయంత్రం 5.30 గంటలకు ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం జరగనుంది. ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ కూడా డిప్యూటీ సీఎంలుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇవాళ ఉదయం జరిగిన బీజేపీ కోర్‌ సమావేశంలో సీఎంగా ఫడ్నవీస్‌ పేరుకు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 288 అసెంబ్లీ స్థానాలకు గానూ 233 సీట్లను గెలుచుకుంది. ఇందులో 132 సీట్లను దక్కించుకున్న బీజేపీ అతి పెద్ద పార్టీగా నిలిచింది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీల మహా వికాస్ అఘాడీ కూటమి కేవలం 46 సీట్లకు మాత్రమే పరిమితమైంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News