Sunday, November 16, 2025
Homeనేషనల్Man climbs on top of bus with bike : నిజ‌మైన బాహుబ‌లి ఇత‌డే

Man climbs on top of bus with bike : నిజ‌మైన బాహుబ‌లి ఇత‌డే

Man climbs on top of bus with bike : మ‌నిషి త‌లుచుకుంటే ఏదైనా సాధించ‌గ‌ల‌డు. సంక‌ల్ప బ‌లం ఉండాలే కానీ సాధించ‌లేనిది ఏదీ ఉండ‌ద‌ని నిరూపించాడో వ్య‌క్తి. బైక్‌ను త‌ల‌పై పెట్టుకుని ఏ మాత్రం త‌డ‌బాటు లేకుండా బ‌స్సు పైభాగంపైకి ఎక్కేశాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం నెటింట్ట చ‌క్క‌ర్లు కొడుతోంది.

- Advertisement -

గుల్జార్ సాహబ్‘ అనే యూజ‌ర్ త‌న ట్విట్ట‌ర్ ఖ‌తాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియోకి వారు నిజ‌మైన ‘సూప‌ర్ హ్యుమ‌న్స్’ అనే క్యాప్ష‌న్ ఇచ్చాడు. ఆ వీడియోలో ఏముందంటే.. ఓ వ్య‌క్తి త‌ల‌పై బైక్‌ను పెట్టుకుని బ‌స్సు వైపుకు న‌డుచుకుంటూ వ‌చ్చాడు. బ‌స్సు పైకి ఎక్క‌డానికి ఇనుప గ్రిల్‌తో ఏర్పాటు చేసిన నిచ్చెన వ‌ద్ద‌కు వ‌చ్చాడు. ఒక్కొ మెట్టు ఎక్కుతూ బైక్‌ను బ్యాలెన్స్ చేస్తూ బ‌స్సు క్యారియ‌ర్ పైకి చేరుకున్నాడు. అత‌డిని అక్క‌డ ఉన్న వారు ఆశ్చ‌ర్యంగా చూస్తూ ఉండిపోయారు.

ఈ ఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగింది, ఎప్పుడు జ‌రిగింది అనే వివ‌రాలు అయితే తెలీదు గానీ.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 90వేలకు పైగా వీక్షణలు వచ్చాయి. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ఈ ‘సూపర్‌మ్యాన్’ ఎవ‌రు అని ఓ నెటీజ‌న్ కామెంట్ చేయ‌గా.. ‘నిజ‌మైన బాహుబ‌లి అంటే ఇత‌డే’ అంటూ ప‌లువురు అత‌డిని కొనియాడుతున్నారు. మరికొందరు క్లిప్‌ని చూసిన తర్వాత తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నామ‌ని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad