రాష్ట్ర స్థాయి సమీక్షలో సమావేశంలో మంత్రి మాట్లాడుతూ… ఒడిశా రాష్ట్రంలోని సింగరేణి నైనీ గని, దేశంలోని అన్ని కొత్త గనులకు పూర్తి సహకారం అందించలని కోరారు. దేశ అవసరాల రీత్యా కొత్త గనుల ప్రారంభం అత్యవసరం సమీక్షలో నైనీ గనిపై వివరించిన సింగరేణి సంస్థ ఛైర్మన్, ఎండి ఎన్. శ్రీధర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జెనా అధికారులతో కూడా సమావేశాలు ఛైర్మన్ తో పాటు పాల్గొన్న డైరెక్టర్ (ఫైనాన్స్ మరియు పా) ఎన్. బలరామ్ తో పాల్గొన్నారు. దేశ బొగ్గు అవసరాలను తీర్చడం కోసం కొత్త గనులను తక్షణమే ప్రారంభించాలని, ఒడిశా రాష్ట్రంలో సింగరేణికి కేటాయించిన నైనీ బొగ్గు బ్లాక్కు పూర్తి సహకారం అందించాలని అలాగే మిగిలిన కంపెనీల కొత్త గనులకు కూడా సంపూర్ణ సహకారం అందించాలని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అమృత్ లాల్ మీనా కోరారు. 21వ తేది ఒడిశా రాష్ట్రం రాజధాని భువనేశ్వర్లో కొత్త బొగ్గు గనుల యజమానులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన ఈవిధంగా దిశా నిర్దేశం చేశారు. దేశంలో విద్యుత్ వినియోగం బాగా పెరుగుతుందని, అందుకు అనుగుణంగా కొత్త గనుల నుండి సకాలంలో బొగ్గు ఉత్పత్తి జరిగి తీరాలని, ఒడిశా రాష్ట్రంలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైనీ బొగ్గు బ్లాక్కు అన్ని అనుమతులు లభించి ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో పర్యావరణ అటవీ శాఖ నుండి పూర్తి సహకారం అందించి అతి త్వరలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమయ్యేందుకు సహకరించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి, సంబంధిత ఉన్నతాధికారులకు సూచనలు చేశారు. దేశం స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తోందని, ఈ క్రమంలో బొగ్గు దిగుమతులను కూడా భారీ ఎత్తున తగ్గించాలని నిర్ణయించిందని, కాబట్టి కొత్త గనులను నిర్దేశిత సమయానికి ప్రారంభించే విధంగా ప్రభుత్వ అధికారులు సహకరించాలన్నారు.
ఈ సమావేశంలో సింగరేణి సంస్థ తరపున పాల్గొన్న సంస్థ ఛైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్. శ్రీధర్ మాట్లాడుతూ నైనీ బొగ్గు బ్లాక్కు స్టేజ్ 1, స్టేజ్ 2 అనుమతులు లభించాయని, బొగ్గు ఉత్పత్తి, రవాణాకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను చేసుకొని బొగ్గు తవ్వకానికి సంసిద్ధంగా ఉన్నామని, అయితే గని ప్రాంతంలో గల చెట్ల లెక్కింపు, తొలగింపు వంటి పనులను అటవీశాఖ ద్వారా త్వరగా పూర్తిచేసి ప్రదేశాన్ని అప్పగిస్తే ఈ ఏడాది కనీసం 50 లక్షల బొగ్గు ఉత్పత్తి చేయడానికి తాము సంసిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
దీనిపై స్పందిస్తూ సింగరేణి సంస్థకు పూర్తి స్థాయిలో సహకరించాలని బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమృతలాల్ మీనా చేసిన సూచనపై చీఫ్ సెక్రటరీ ప్రదీప్ జెనా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో కోల్ ఇండియా ఛైర్మన్ శ్రీ ప్రమోద్ అగర్వాల్తో పాటు ఒడిశా రాష్ట్రంలో కొత్తగా గనులు చేపడుతున్న మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్, నార్తరన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్, ఇంకా ఇతర కొత్త బ్లాకుల కంపెనీల వారు పాల్గొన్నారు. సింగరేణి ఛైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్. శ్రీధర్ తో పాటు డైరెక్టర్ (ఫైనాన్స్ మరియు పర్సనల్) శ్రీ ఎన్. బలరామ్, అడ్వైజర్ ఫారెస్ట్రీ శ్రీ సురేంద్ర పాండే పర్యటనలో పాల్గొన్నారు. రాష్ట్ర ఉన్నత అధికారులతో భేటీ అలాగే సింగరేణి సంస్థ ఛైర్మన్ మరియు ఎండి ఎన్. శ్రీధర్ ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శులు శ్రీ వినీల్ కృష్ణ, శ్రీ కుట్టి తో కూడా సమావేశమై నైనీ బొగ్గు బ్లాక్కు సంబంధించి సహకారాన్నికోరారు. దీనిపై వారు స్పందిస్తూ సంపూర్ణ సహకారం అందించే విధంగా జిల్లా కలెక్టర్ మరియు అటవీశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలియజేశారు. ఒడిశా రాష్ట్ర పర్యటలో ఉన్న సంస్థ ఛైర్మన్ ఎండి శ్రీ ఎన్.శ్రీధర్ నైనీ బ్లాకు జనరల్ మేనేజర్, ఇతర అధికారులతో ప్రత్యేక సమీక్షను నిర్వహించారు. బొగ్గు ఉత్పత్తి కోసం తీసుకుంటున్న సన్నాహాలు ఆయన సమీక్షించారు. మరో రెండు నెలలలో బొగ్గు ఉత్పత్తి, రవాణాకు సర్వ సన్నధ్దమై ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జీఎం(నైనీ) టి.శ్రీనివాస్ రావు, డి.జి.ఎం. సుజయ్ మజుందార్, ఎస్.ఈ. ప్రవీణ్ కాశ్యప్ తదితరులు పాల్గొన్నారు.