ప్రధానిగా నరేంద్ర మోడీ ఈ రాత్రి 7.30 గంటలకు బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో మోడీ ప్రధానిగా మూడోసారి ప్రమాణం చేస్తారు.
అయితే కీలక శాఖలను మాత్రం తమవద్ద ఉంచుకునే పకడ్బందీ ప్రణాళికతో ఉన్న మోడీ కొన్ని శాఖలనే తమ సహచర పార్టీలకు, కూటమి భాగస్వామ్య పక్షాలకు పంచనున్నారని తెలుస్తోంది. డిఫెన్స్, ఫైనాన్స్, ఫారిన్, హోం వంటి శాఖలను బీజేపీ తనవద్దనే పెట్టుకుటుందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక తమిళనాడులో ఓటమిపాలై ఖాతా కూడా తెరవలేకపోయినా సీట్ల లెక్క కాకుండా ఓట్ల లెక్క ప్రకారం అక్కడి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైకి కేంద్ర మంత్రి పదవి దక్కనుంది.
టీడీపీ ఎంపీలు కింజరపు రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్ పెమ్మసానిలకు కేంద్ర మంత్రి పదవులు కన్ఫం కాగా వీరిద్దరూ మోడీతో పాటు పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మోడీతో పాటు మరో 30 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్టు సమాచారం. 78-81 మంది మంత్రులు ఈసారి కొలువతీరనుండటంతో ఇది జంబో కాబినెట్ కానుంది.
1952, 1957, 1962ల్లో వరుసగా మూడుసార్లు ప్రధాని పదవిని చేపట్టని నెహ్రూ తరువాత ఈ రికార్డును సృష్టించిన ప్రధానిగా మోడీ చరిత్రకెక్కారు.