ఎం.ఫిల్ డిగ్రీని ఉపసంహరించుకున్న యూజీసీ.. కొత్తగా ఎం. ఫిల్ అడ్మీషన్స్ తీసుకోవద్దని విద్యా సంస్థలకు ఆదేశించిన యూజీసీ.. కొన్ని చోట్ల అడ్మిషన్స్ తీసుకుంటున్నారని యూజీసీ దృష్టికి రావడంతో.. విద్యార్థులు ఎవరూ చేరకూడదని సూచించిన యూజీసీ.
విద్యావిధానంలో సమూలంగా మార్పులు తేవటంలో భాగంగా ఎక్కువమంది విద్యార్థులు పీహెచ్డీ డిగ్రీని పూర్తి చేసేలా, పీహెచ్డీలో డ్రాపవుట్స్ సంఖ్యను భారీగా తగ్గించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఈ చర్యలు చేపట్టి అమలు చేస్తోంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో (NEP) భాగంగా మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ అంటే ఎంఫిల్ ను డిస్కంటిన్యూ చేస్తూ 2022-2023 విద్యాసంవత్సరం నుంచి దీన్ని డిస్కంటిన్యూ చేసింది. దీంతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరువాత డైరెక్ట్ గా పీహెచ్డీకి అడ్మిషన్ తీసుకునేలా చర్యలు చేపట్టింది.
ఎంఫిల్ చేయటంతో విద్యార్థుల విలువైన సమయం, డబ్బు రెండూ వృథా కావటంతో పాటు ఎంఫిల్ పూర్తి చేసినప్పటికీ ఎటువంటి ప్రత్యేక వెయిటేజీ దక్కకపోగా పీహెచ్డీ సీటు దొరకనివారు ఇలా ఎంఫిల్ చేరుతుండటంతో ప్రయోజనం లేకుండా పోతోందని ఎప్పటినుంచో ఎంఫిల్ ను డిస్కంటిన్యూ చేసే యోచనలో ఉన్నప్పటికీ ఎన్ఈపీలో భాగంగా ఇది సాధ్యమైంది.