పరమ పవిత్రమైన గంగా నదిలో కొన్ని రోజులపాటు ఉండిపోవాలనుకునే వారికి కొరతే లేదు. ఇలాంటి ఆలోచలను మనదేశం వారికే కాదు ప్రపంచం నలుమూలల్లో ఉన్నవారికి ఉంటాయి. అందుకే లగ్జరీ రివర్ క్రూజ్ ను స్టార్ట్ చేసింది ఉత్తర్ ప్రదేశ్ టూరిజం.
స్పా, జిమ్, నాయిస్ కంట్రోల్, పొల్యూషన్ ఫ్రీ సిస్టం టెక్నాలజీ అన్నీ ఈ క్రూజ్ లో ఉంటాయి. లాంగెస్ట్ రివర్ క్రూజ్ గా ఉన్న ఈ ప్రయాణంలో మీకు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఉంది. కాబట్టి పాత క్రూజుల్లో తలెత్తే సీవేజ్ సమస్యలు ఇందులో అస్సలు రావు. పరమ పవిత్రమైన గంగా నదిలో మన వ్యర్థాలు పోయి అపవిత్రం, కలుషితం కాకుండా ఇది ఫిల్టర్ చేస్తుంది. గంగా నదిపై తేలియాడుతూ గంగా పరివాహక ప్రాంతాల్లో విహరిస్తూ, పవిత్ర క్షేత్రాలన్నీ ఒకే విడతలో చూడాలంటే ఇది అరుదైన అవకాశం. ఎంవీ గంగా విలాస్ లో ప్రయాణిస్తే రెండు నెలలపాటు నిత్యం గంగా నదిలో పవిత్ర స్నానం, పూజలు అన్నీ చేసుకుని మంచి ఫిలసాఫికల్ జర్నీని పూర్తి చేసే అవకాశం లభిస్తుంది. ఎలాగూ వర్క్ ఫ్రం హోం కాబట్టి టికెట్లు దొరికితే ఈ గంగా విలాస్ క్రూజ్ జర్నీ పూర్తి చేసేయండి.
గంగా విలాస్ హైలైట్స్ చెప్పాలంటే చాలానే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఇది మేడ్ ఇన్ ఇండియా క్రూజ్ వెజెల్. 3,200 కిలోమీటర్లు, 51 రోజుల్లో తిరిగేలా దీన్ని డిజైన్ చేశారు. ఈ ఫస్ట్ జర్నీలో ఏకంగా 32 మంది స్విట్జర్లాండ్ టూరిస్టులు ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నారు.
ఫైవ్ స్టార్ మూవింగ్ హోటల్ లో ఏకంగా 18 సూట్లున్నాయి. ఇందులో 36 మంది టూరిస్టులు కంఫర్టబుల్ గా ఉండచ్చు. 40 మంది క్రూ మెంబర్స్ కు అకామడేషన్ కూడా క్రూజ్ లోనే ఉంటుంది. ఈ లగ్జరీ షిప్ ఎంత పెద్దదంటే దీని పొడవు 62 మీటర్స్ కాగా 12 మీటర్ల వెడల్పుంది.
రోజుకు 25,000-50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 51 రోజుల జర్నీకి అయ్యే ఒక్క టికెట్ ధర 20,00,000 రూపాయలు. వల్డ్ లాంగెస్ట్ రివర్ క్రూజ్ గా ఎంవీ గంగా విలాస్ చరిత్ర సృష్టిస్తోంది. 50 టూరిస్టు డెస్టినేషన్స ఇందులో కవర్ అవుతాయి. వీటిలో హెరిటేజ్ సైట్స్ కూడా ఉన్నాయి. పెద్ద సిటీలైన బిహార్ లోని పట్నా, జార్ఖండ్ లోని షాహిగంజ్, వెస్ట్ బెంగాల్ లోని కోల్ కతా, బంగ్లాదేశ్ లోని ఢాకా, అస్సాంలోని గౌహతి ఉన్నాయి.