Saturday, November 15, 2025
Homeనేషనల్SCI-TECH WONDER: ఆలోచిస్తే చాలు.. బ్యాటరీ ఫుల్... సోషల్ మీడియా రీల్స్ స్ఫూర్తితో ప్రొఫెసర్...

SCI-TECH WONDER: ఆలోచిస్తే చాలు.. బ్యాటరీ ఫుల్… సోషల్ మీడియా రీల్స్ స్ఫూర్తితో ప్రొఫెసర్ అద్భుత ఆవిష్కరణ!

Charge battery by thinking : ఛార్జింగ్ పెట్టాలని మీరు మనసులో అనుకుంటే చాలు.. మీ ఎలక్ట్రిక్ వాహనం బ్యాటరీ దానంతట అదే ఛార్జ్ అవ్వడం మొదలవుతుంది! ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో కథ కాదు, మన భారతీయ శాస్త్రవేత్త సాధించిన అద్భుతం. సోషల్ మీడియా రీల్స్ అల్గారిథమ్ నుంచి స్ఫూర్తి పొంది, ఓ ఇంజినీరింగ్ ప్రొఫెసర్, వాహనదారుడి ఆలోచనలను చదివి, బ్యాటరీని ఛార్జ్ చేసే సరికొత్త ‘న్యూరో స్లైడింగ్ మోడ్ కంట్రోలర్ ఛార్జర్‌’ను ఆవిష్కరించారు. అసలు ఈ అద్భుత ఆవిష్కరణ వెనుక ఉన్న ఆలోచన ఏంటి..? ఇది ఎలా పనిచేస్తుంది..?

- Advertisement -

రీల్స్ నుంచి మెరుపు ఐడియా : ఈ ఆవిష్కర్త పేరు అఖిలేశ్ సింగ్. ఉత్తరాఖండ్‌లోని ఓ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఒకరోజు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తుండగా, ఆయనకు ఓ మెరుపులాంటి ఆలోచన వచ్చింది.

అల్గారిథమ్ స్ఫూర్తి: “మనం ఏ రకమైన రీల్స్ ఎక్కువగా చూస్తామో, సోషల్ మీడియా అల్గారిథమ్ మనకు అలాంటి రీల్స్‌నే చూపిస్తుంది. ఇదే సూత్రాన్ని వాహనాల ఛార్జింగ్‌కు ఎందుకు ఉపయోగించకూడదు?” అని ఆయన ఆలోచించారు.

మూడేళ్ల శ్రమ: ఆ ఆలోచనకు రూపమిచ్చేందుకు, మూడేళ్ల పాటు అలుపెరగకుండా శ్రమించి, కృత్రిమ మేధ (AI), న్యూరాన్ రీడింగ్ టెక్నాలజీ ఆధారంగా ఈ సరికొత్త ఛార్జర్‌ను రూపొందించారు.

ఇది ఎలా పనిచేస్తుంది : ఈ ‘న్యూరో స్లైడింగ్ మోడ్ కంట్రోలర్ ఛార్జర్’ పనితీరు అత్యంత సంక్లిష్టమైనది, ఆసక్తికరమైనది.
ఆలోచనలను చదవడం: ఈ ఛార్జర్‌లోని ఏఐ-న్యూరాన్ రీడింగ్ టెక్నాలజీ, వాహనదారుడి మెదడు ఆలోచనలను, నిర్ణయాలను విశ్లేషిస్తుంది. మీరు రోజూ ఏయే సమయాల్లో ఛార్జింగ్ పెడుతున్నారనే మీ అలవాట్లను ఇది నమోదు చేసుకుంటుంది.

అప్రమత్తమవ్వడం: “ఛార్జింగ్ పెట్టాలి” అనే ఆలోచన మీ మెదడులో మెదలగానే, ఈ టెక్నాలజీ దానిని గుర్తిస్తుంది.
ఆటోమేటిక్ ఛార్జింగ్: ఆ ఆలోచనా తరంగాలు ఛార్జర్‌కు చేరగానే, అది వెంటనే బ్యాటరీని ఛార్జ్ చేసే పనిని మొదలుపెడుతుంది. దీనికోసం, ఈ ఛార్జర్‌ను ఎల్లప్పుడూ వాహనం బ్యాటరీకి అనుసంధానించి ఉంచాలి.

సోషల్ మీడియా రీల్స్ అల్గారిథమ్ సూత్రం ఆధారంగానే, ఏఐ టెక్నాలజీతో మెదడు ఆలోచనలను చదవగలిగే ఈ ఛార్జర్‌కు రూపకల్పన చేశాను. దీనికి అమెరికా నుంచి పేటెంట్ పొందేందుకు ప్రయత్నిస్తున్నాను. అది రాగానే, మన దేశానికే అంకితం చేస్తాను.”
– అఖిలేశ్ సింగ్, అసిస్టెంట్ ప్రొఫెసర్

ఛార్జర్ ప్రత్యేకతలు :20 కిలోల బరువుండే ఈ ఛార్జర్, స్కూటర్ల నుంచి బస్సుల వరకు అన్ని రకాల వాహనాల బ్యాటరీలను (లిథియం, లెడ్ యాసిడ్) వేగంగా ఛార్జ్ చేయగలదు.
వాహనం ఎత్తైన ప్రదేశాలను ఎక్కేటప్పుడు, బ్యాటరీ శక్తి తగ్గకుండా చూడటం దీని మరో ప్రత్యేకత.

ఉత్తరాఖండ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ ప్రాజెక్టుకు రూ.6.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈ ఆవిష్కరణ వాణిజ్యపరంగా అందుబాటులోకి వస్తే, ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో ఓ విప్లవాన్నే సృష్టించడం ఖాయం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad