Saturday, November 23, 2024
Homeనేషనల్Niranjan Reddy: స్వామినాథన్ ను కలిసిన నిరంజన్ రెడ్డి

Niranjan Reddy: స్వామినాథన్ ను కలిసిన నిరంజన్ రెడ్డి

స్వామినాథన్ ను కలిసిన వ్యవయసాయ మంత్రి, బృందం

చెన్నై రత్ననగర్ లో హరిత విప్లవ పితామహుడు ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ ని వారి నివాసంలో కలిసి, అనంతరం స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ సందర్శించారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బృందం. తెలంగాణకు వస్తా, వ్యవసాయ ప్రగతి చూస్తా, అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూడాలని ఉంది అంటూ ఆయన వ్యవసాయ శాఖా మంత్రి ప్రతినిధి బృందానికి స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో 9 ఏళ్లలో తెలంగాణ వ్యవసాయ విజయాలను వివరించి, మీ స్ఫూర్తితోనే రైతు అనుకూల విధానాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

రైతుబంధు, రైతుభీమా, 24 గంటల ఉచిత కరంటు, సాగునీరు, పంటల కొనుగోళ్ల తీరు, ప్రత్యామ్నాయ పంటల సాగు ఆవశ్యకత, రైతువేదికలు వంటి వాటిని వారి దృష్టికి తీసుకెళ్లినట్టు మంత్రి తెలిపారు. ఐక్యరాజ్యసమితి Food & Agriculture Organisation వాళ్లు మానవాళిని ప్రభావితం చేసిన 20 బృహత్ పథకాలలో తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు, రైతుభీమా పథకాలున్నాయి అన్న విషయం వారి దృష్టికి తీసుకెళ్లగా,అన్ని విషయాలు నాకు తెలుసు, గతంలో FAO చైర్మన్ గా పనిచేసినట్లు తెలిపారు స్వామినాథన్. 98 ఏళ్ల వయసులోనూ వారి ఇంత గొప్ప జ్ఞాపకశక్తి అమోఘం .. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావును పరిచయం చెయ్యగానే గతంలో చూసినట్లు తెలిపారు.

ఇక్రిశాట్ ఏర్పాటుకు ఆద్యుడు స్వామినాథన్ .. వ్యవసాయరంగంలో వచ్చిన అనేక నూతన ఆవిష్కరణలకు ఐకార్ డైరెక్టర్ గా పనిచేసిన స్వామినాథన్ కారణం. వ్యవసాయ విస్తరణ, విద్య, సాంకేతిక పరిజ్ఞానం అన్నింటికీ ఆయనే ఆద్యుడు. 2004 యూపీఏ ప్రభుత్వంలో వేసిన వ్యవసాయ కమీషన్ కు నాయకత్వం వహించిన స్వామినాథన్ గారు భారత అవసరాలే కాకుండా ప్రపంచ అవసరాలను తీర్చే దేశం భారతదేశం అని రైతుల ఆదాయం పెరగాలి, వారి ఆదాయం సుస్థిరంగా ఉండాలి అని సూచనలు చేశారు. 2007 లో స్వామినాధన్ నివేదిక ఇచ్చినా 2014 వరకు దానిని యూపీఎ ప్రభుత్వం అమలు చేయలేదు .. దానికి ఆయన బాధపడ్డారు.

స్వామినాధన్ నివేదిక అమలు చేయలేదని, ఇది స్వామినాథన్ గారిని అవమానించడమేనని యూపీఏను ప్రశ్నించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధికారంలోకి రాగానే అమలు చేస్తామని 2013 లో ప్రకటించారు. 2014 లో ఎన్డీఎ అధికారంలోకి వచ్చి , మోడీ ప్రధాని అయ్యాక స్వామినాథన్ కమిటీపై అశోక్ దల్వాయితో మరో కమిటీ వేసి అవమానించారు. దాని మీద వచ్చిన నివేదికతో 2022 వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం అన్నారు .. ఇప్పటికి 2023 వస్తున్నా రైతుల ఆదాయం రెట్టింపు సంగతి పక్కన పెడితే నరేంద్రమోడీ ఒక్క హామీ అమలు కాలేదు.

ఉపాధిహామీ పథకం వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని, స్వామినాథన్ సిఫార్సులు అమలు చేస్తామని గాలికి వదిలేశారు. పైగా స్వామినాథన్ సిఫార్సులు అమలు చేస్తున్నట్లు దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. యూపీఎ, ఎన్డీఎ ప్రభుత్వాలు స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయకపోవడం అత్యంత బాధాకరం. ఈ దేశంలో రైతు కేంద్రంగా, రైతు విధానాలు కేంద్రంగా దేశంలో గొప్ప మార్పు రావాల్సి ఉన్నది .. ఆ దిశగా దేశం ఆలోచిస్తున్నది.

చెన్నై రత్ననగర్ లో హరిత విప్లవ పితామహుడు ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ ని వారి నివాసంలో కలిసి, అనంతరం స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ సందర్శించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వారి వెంట రాష్ట్ర వ్యవసాయ శాఖా కార్యదర్శి రఘునందన్ రావు, విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతంలు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News