Non BS-VI Commercial Vehicles ban in Delhi: దేశ రాజధానిలో ప్రస్తుతం నెలకొన్న వాయు కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శీతాకాలం ఆరంభం నుంచే ఢిల్లీలో వాయు కాలుష్యం ఊహించనంత రేంజ్‌లో పెరిగిపోయింది. ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు బీఎస్-6 ఉద్గార ప్రమాణాలను పాటించని అన్ని వాణిజ్య వాహనాలు (Non BS-VI Commercial Vehicles Ban) నవంబర్ 1 నుంచి సిటీ పరిధిలోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (సీఏక్యూఎం) జారీ చేసిన ముందస్తు ఆదేశాలతో ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఈ తాజా నిర్ణయంతో రేపటి నుంచి (నవంబర్1) నుంచి బీఎస్-6 కంప్లైంట్ కమర్షియల్ వెహికిల్స్‌ని మాత్రమే ఢిల్లీలోకి అనుమతించనున్నట్లు రవాణా శాఖ జారీ చేసిన పబ్లిక్ నోటీసులో పేర్కొంది. ఈ కఠినమైన ఉద్గార ప్రమాణాలు వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు.
Also Read: Invicta: రూ.30,950కే ఎలక్ట్రిక్ స్కూటర్
వీటికి మినహాయింపు: ఢిల్లీలో రిజిస్టర్ అయిన కమర్షియల్ గూడ్స్ వెహికిల్స్, BS-VI కంప్లైంట్ డీజిల్ వాహనాలు, BS-IV డీజిల్ వాహనాలు (అక్టోబర్ 31, 2026 వరకు), ఇతర సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వాహనాలకు మినహాయింపు ఉంటుంది. ఇక ఢిల్లీలో గాలి నాణ్యత స్థాయిలను బట్టి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) కింద ఆంక్షలను ఎత్తివేసే అవకాశం ఉంటుంది.
CAQM’s కాలుష్య నియంత్రణ ఆదేశాలు: అక్టోబర్ 17న జరిగిన CAQM సమావేశంలో ఖరారు చేసింది. ఢిల్లీలో కాలుష్య స్థాయిలు పెరగుతుండటంతో అది తీవ్ర సమస్యకు దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడ వాహన ఉద్గారాలు, పొలాల్లో పంట కాల్చివేత వంటివి గాలి నాణ్యతను మరింత ప్రమాదకరమైన స్థాయికి తీసుకెళ్తున్నాయి. కాలుష్యాన్ని తగ్గించేందుకు కఠినమైన నిబంధనలను అమలు చేయడం ద్వారా పరిస్థితిని అదుపులోకి తీసుకురావ్చనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నారు.


