ప్రతి ఐదుగురు ఎంపీలకు ఒక కేంద్ర మంత్రి పదవి ఇవ్వనున్నట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా ఎన్డీయే కూటమి పార్టీలకు వెల్లడించారు. ఆ లెక్కన టీడీపీకి ముగ్గురు కేంద్ర కేబినెట్ మంత్రి పదవులతో పాటు ఒక ఎంఓఎస్ లేదా ఇండిపెండెంట్ ఛార్జ్ ఉన్న పోర్ట్ ఫోలియో దక్కనుంది. ఐదుగురు కంటే తక్కువ ఎంపీలున్న పార్టీలకు ఒక ఎంఓఎస్ లేదా ఒక ఇండిపెండెంట్ మినిస్ట్రీ దక్కేలా ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలను బీజేపీ సముదాయిస్తోందని ఢిల్లీ వర్గాల భోగట్టా.
- Advertisement -
ప్రతి ఇద్దరు ఎంపీలకు ఒక ఎంఓఎస్ పోర్ట్ ఫోలియో దక్కనుంది.
ఈ లెక్కన కూటమిలోని అన్ని పార్టీలను సంతృప్తిపరిచేలా బీజేపీ సరికొత్త సమీకరణాన్ని తెచ్చినట్టు సమాచారం.