లోక్ సభలో బడ్జెట్ ప్రసంగాన్ని విపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Seetharaman) బడ్జెట్ ప్రవేశపెడుతుండగా విపక్షాలు నినాదాలు చేశాయి. కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై చర్చ జరగాలని పట్టుబట్టాయి.
- Advertisement -
విపక్షాల నినాదాల మధ్యనే ఆమె బడ్జెట్ ప్రసంగం కొనసాగించారు. అయితే స్పీకర్ ఓం బిర్లా వాదిస్తున్నా కూడా సభ నుంచి విపక్ష ఎంపీలు బయటకు వెళ్లిపోయారు. ప్రస్తుతం బడ్జెట్ ప్రసంగాన్ని నిర్మలమ్మ చదువుతున్నారు.