Pak Minister sensational comments on India: పాక్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం అవకాశాలను ఏమాత్రం తిరస్కరించలేమని అన్నారు. మరోసారి భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉందని తెలిపారు. పాక్ రక్షణ మంత్రి తాజాగా చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి.
గతంలో కంటే మెరుగైన ఫలితాన్ని సాధిస్తాం: పాక్ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ తాజాగా పాక్‌కు చెందిన సమా టీవీలో మాట్లాడుతూ.. పాకిస్థాన్, భారత్ మధ్య నేను ఉద్రిక్తతలను కోరుకోవడం లేదని అంటూనే.. రెండు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులను తిరస్కరించడం లేదనే వ్యాఖ్యలు చేశాడు. మళ్లీ భారత్‌తో యుద్ధం జరిగే అవకాశం లేకపోలేదని తెలిపారు. ఒకవేళ యుద్ధం జరిగితే పాక్ గతంలో కంటే మెరుగైన ఫలితాన్ని సాధిస్తుందని అన్నారు. భారత్ ఎళ్లప్పుడూ ఐక్యదేశంగా లేదనే అంశం చరిత్ర చెబుతుందని అన్నారు. ఔరంగజేబు పాలనలో మాత్రమే భారత్ ఐక్యంగా ఉందని తెలిపారు. కానీ పాక్ మొదటి నుండి ఐక్యంగానే ఉందని అన్నారు. స్వదేశంలో మేము వాదించుకుంటాం.. పోటీ పడతాం. కానీ.. భారత్‌తో యుద్ధం అనగానే తామంతా కలిసే ఉంటామంటూ బీరాలు పలికారు. దీంతో పాక్ మంత్రి వ్యాఖ్యలపై కొత్త చర్చ నడుస్తోంది. ఈ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో నెటిజెన్లు పలు ఆసక్తికర కామెంట్లు పెడుతున్నారు. పాక్‌కు ఇంకా బుద్ధిరాలెదని అంటున్నారు.
పాక్ మంత్రికి ఇది కొత్తేంకాదు: పాక్ రక్షణ మంత్రి భారత్‌పై నోరుపారేసుకోవడం ఇది కొత్తేంకాదు. ఇంతకు ముందుకూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. భవిష్యత్తులో సైనిక ఘర్షణ జరిగితే తమ యుద్ధవిమానాల శిథిలాల కింద భారత్(India) సమాధి అవుతుందే అహంకార పూరిత కామెంట్స్ చేశారు. ఆపరేషన్ సింధుర్‌లో భారత్‌కు భారీ నష్టం వాటిల్లిందని అన్నారు. దెబ్బతిన్న ప్రతిష్టను, విశ్వసనీయతను పునరుద్ధరించుకోవడానికి భారత్ విశ్వప్రయత్నాలు చేస్తుందని అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్‌లో భారత్ 0–6 స్కోర్‌తో ఓడిపోయిందని కూడా అన్నారు. మరోసారి తమతో సైనిక ఘర్షణకు దిగితే భారత్‌ను సమాధి చేస్తామని కూడా హెచ్చరించారు. కాగా భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదులను ఎగదోస్తే ప్రపంచ పటం నుంచి పాక్‌ను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని.. భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించిన తర్వాత ఖవాజా ఇలా వ్యాఖ్యలు చేశారు.


