Sunday, July 7, 2024
Homeనేషనల్Parliamet: అదానీతో ప్రధాని రిలేషన్ ఏంటి ? ప్రధానిని నిలదీసిన రాహుల్

Parliamet: అదానీతో ప్రధాని రిలేషన్ ఏంటి ? ప్రధానిని నిలదీసిన రాహుల్

ప్రధాని నరేంద్ర మోడీ మీద పలు ఆరోపణాస్త్రాలు ఎక్కుపెట్టి ప్రసంగించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. బిలియనీర్, వ్యాపార సామ్రాజ్యాధినేత అయిన గౌతం అదానీకి మోడీ అండగా ఉన్నారంటూ రాహుల్ ఆరోపించారు. అదానీ గ్రూప్ కు మోడీ మద్దతుగా నిలిచారని ..అందుకే అదానీ వ్యాపార సామ్రాజ్యం వైఫల్యం చెందలేదని రాహుల్ చెప్పుకొచ్చారు. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ఇలా ఏరంగంలో అడుగు పెట్టినా అదానీ ఎలా సక్సెస్ సాధించారని తనను ప్రజలు భారత్ జోడో పాదయాత్రలో అడిగేవారని రాహుల్ పార్లమెంట్ లో ప్రస్తావించారు. అసలు అదానీతో ప్రధానికి ఉన్న సంబంధం ఏంటని రాహుల్ అడిగారు. రాహుల్ ప్రసంగంపై మండిపడ్డ కేంద్ర న్యాయశాఖా మంత్రి కిరణ్ రిజిజు ఇలా రాహుల్ ఆరోపణలు చేసేముందు సరైన సాక్షాధారాలు ఇవ్వాలన్నారు. దీంతో పరిస్థితి కాసేపు రాహుల్ వర్సెస్ మంత్రిగా పార్లమెంట్ లో వాడివేడిగా వాగ్వాదాలు సాగాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News