ప్రతి నెల చివరి ఆదివారం ప్రధాని మోదీ(PM Modi) ‘మన్ కీ బాత్’(Mann Ki Baat) కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజా ఎపిసోడ్‌లో సినిమా ఇండస్ట్రీ గురించి ఆయన మాట్లాడారు. భారతీయ చలనచిత్ర రంగం వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖుల పేర్లను ప్రస్తావించారు.
ఇందులో భాగంగా దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswara Rao)టాలీవుడ్ ఇండస్ట్రీకి చేసిన సేవలను కొనియాడారు. తన సినిమాలలో భారతీయ సంప్రదాయాలు, విలువలను చూపిస్తూ తెలుగు మూవీ ఇండస్ట్రీని మరో స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు. ఇక బాలీవుడ్ దర్శకుడు తపన్ సిన్హా సినిమాలు సమాజానికి కొత్త బాటలు వేశాయన్నారు. రాజ్ కపూర్ తన సినిమాల ద్వారా దేశంలోని సున్నితమైన అంశాలను ప్రపంచానికి పరిచయం చేశారని కీర్తించారు.
వచ్చే ఏడాది వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్‌ను తొలిసారిగా భారత్‌లో నిర్వహించనున్నట్లు చెప్పుకొచ్చారు. ఇందులో మీడియా, వినోద పరిశ్రమకు చెందిన ప్రపంచ దేశాల దిగ్గజాలు పాల్గొంటారని వెల్లడించారు.