Sunday, November 16, 2025
Homeనేషనల్MS Swaminathan : భారతమాత ముద్దుబిడ్డ స్వామినాథన్ - ప్రధాని మోదీ భావోద్వేగ నివాళి!

MS Swaminathan : భారతమాత ముద్దుబిడ్డ స్వామినాథన్ – ప్రధాని మోదీ భావోద్వేగ నివాళి!

PM Modi on MS Swaminathan : దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త, భారత హరిత విప్లవ పితామహుడు ఎం.ఎస్. స్వామినాథన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. స్వామినాథన్ జయంతి సందర్భంగా దిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, స్వామినాథన్‌ను “భారతదేశానికి లభించిన అమూల్యమైన రత్నం”గా కీర్తించారు. ఈ నేపథ్యంలో అసలు స్వామినాథన్‌తో మోదీకి ఉన్న ఆ ప్రత్యేక అనుబంధం ఏమిటి..?  ఆయన ఆలోచనలు నేటి తరానికి, దేశ భవిష్యత్తుకు ఎలా మార్గనిర్దేశం చేస్తున్నాయి..? పూర్తి వివరాలు తెలుసుకుందాం!

- Advertisement -

ప్రజాసేవకే అంకితమైన విజ్ఞాన గని..

యుగపురుషుడు – భారతమాత ముద్దుబిడ్డ: “కొంతమంది మహనీయుల సేవలు ఒక ప్రాంతానికో, ఒక తరానికో పరిమితం కావు. ప్రొఫెసర్ స్వామినాథన్ అలాంటి గొప్ప శాస్త్రవేత్త. ఆయన భారతమాతకు నిజమైన పుత్రుడు. తన విజ్ఞానాన్ని కేవలం ఆవిష్కరణలకే పరిమితం చేయకుండా, ప్రజాసేవకు ఒక మాధ్యమంగా మలచుకున్నారు. దేశ ఆహార భద్రతనే తన జీవిత లక్ష్యంగా చేసుకున్నారు,” అని మోదీ కొనియాడారు. తమ ప్రభుత్వానికి ఆయనకు ‘భారతరత్న’ పురస్కారం అందించే భాగ్యం కలగడం గొప్ప గౌరవమని ప్రధానినరేంద్ర మోదీ పేర్కొన్నారు.

గుజరాత్ సంక్షోభంలో స్వామినాథన్ సహకారం: తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి రోజులను ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు. “స్వామినాథన్‌ గారితో నా అనుబంధం చాలా పాతది. అప్పట్లో గుజరాత్ కరువు, తుపానులతో తీవ్ర వ్యవసాయ సంక్షోభంలో ఉండేది. ముఖ్యంగా కచ్ ప్రాంతంలో ఎడారి విస్తరిస్తోంది. ఆ సమయంలో మేము ‘సాయిల్ హెల్త్ కార్డ్’ ప్రాజెక్టును ప్రారంభించామన్నారు.. ఈ విషయంపై స్వామినాథన్ గారు ఎంతో ఆసక్తి చూపించి, మాకు బహిరంగంగా విలువైన సూచనలిచ్చారు, మార్గనిర్దేశం చేశారు. ఆయన సహకారంతోనే ఆ ప్రాజెక్టులో అద్భుతమైన విజయం సాధించగలిగాం,” అని ప్రధాని మోదీ తన అనుబంధాన్ని వివరించారు.

 ‘బయో-హ్యాపీనెస్’ రూపశిల్పి: ప్రపంచం జీవవైవిధ్య పరిరక్షణ గురించి మాట్లాడుతున్న రోజుల్లోనే, స్వామినాథన్ ఒక అడుగు ముందుకు వేసి “బయో-హ్యాపీనెస్” (జీవ-సంతోషం) అనే అద్భుతమైన భావనను ప్రపంచానికి అందించారని మోదీ ప్రశంసించారు. “జీవవైవిధ్యం యొక్క శక్తిని ఉపయోగించి, స్థానిక ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురావడమే బయో-హ్యాపీనెస్. ఈ భావన ద్వారా ప్రజల జీవితాల్లో సంతోషాన్ని నింపవచ్చని డాక్టర్ స్వామినాథన్ బలంగా నమ్మారు,” అని ప్రధాని తెలిపారు. మొత్తం మీద, స్వామినాథన్ కేవలం ఒక శాస్త్రవేత్త మాత్రమే కాదని, ఆయన ఒక దార్శనికుడని, ఆయన ఆలోచనలు నేటికీ వ్యవసాయ రంగానికి, దేశానికి దిక్సూచిగా నిలుస్తాయని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రతి భారతీయుడినీ ఆలోచింపజేస్తాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad