కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీకి(PM Modi) లేఖ రాశారు. ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడితో తలెత్తిన పరిస్థితిని ఎదుర్కోవడంపై సమిష్టిగా చర్చ చేపడతామని కోరారు. ఇందుకోసం పార్లమెంటు ఉభయ సభల ప్రత్యేక సమావేశాన్ని వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు.
- Advertisement -

మరోవైపు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ లోక్‌సభ పక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసిందన్నారు. ఈ క్లిష్ట సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనం కలిసి ఉంటామని అందరికీ తెలియజేయాలన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేయాలని ప్రతిపక్షాలు విశ్వసిస్తున్నాయని తెలిపారు.
