Monday, November 17, 2025
HomeతెలంగాణRahul Gandhi: సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అభినందన లేఖ

Rahul Gandhi: సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అభినందన లేఖ

Rahul Gandhi: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావొస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి కాంగ్రెస్ అగ్రనాయకులు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు బాగుందని ప్రశంసించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో పాలన అద్భుతంగా సాగుతోందని కొనియాడారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న కులగణ సర్వే చాలా బాగుందన్నారు. ఈ కార్యక్రమం దేశానికే మార్గనిర్దేశకం అవుతుందని లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -

రాహుల్ గాంధీ లేఖకు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. “ప్రియమైన రాహుల్ గాంధీ గారు.. మా పని అంతా మీ ఆలోచనలు, నాయకత్వం ద్వారా ప్రేరణ పొందింది. తెలంగాణలో కులగణన సర్వే మిమ్మల్ని గర్వపడేలా చేయడం మాకు మరింత శక్తిని ఇస్తుంది. మీ విజన్, హామీలకు అనుగుణంగా తెలంగాణ గిగ్ వర్కర్స్ పాలసీని సమగ్రంగా కలుపుకుని న్యాయంగా ముందుకెళ్తామని హామీ ఇస్తున్నాం” అని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad