Friday, September 20, 2024
Homeనేషనల్RBI: 2000 రూపాయల నోట్లు బ్యాన్

RBI: 2000 రూపాయల నోట్లు బ్యాన్

 మార్కెట్లో రూ.2000 నోటు చలామణి నుంచి ఆర్బీఐ ఉపసంహరించుకున్నది. ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు మార్చుకునేందుకు ప్రజలకు అనుమతి ఇచ్చింది. 2000 నోటు వల్ల బ్లాక్ మనీ పెరుగుతుందన్న నేపథ్యంలో ఈ నోట్లను రిజర్వ్ బ్యాంక్ అర్ధాంతరంగా ఉపసంహరించింది. దేశంలోని 19 ప్రాంతీయ ఆర్బీఐ శాఖల్లో వాటిని మార్చుకునేందుకు అనుమతి ఇచ్చింది. బ్యాంకులు సైతం రూ.2000 నోట్లను సర్క్యులేషన్‌లో పెట్టవద్దని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

రూ.2000 నోట్లు ఉన్న వారు వచ్చే సెప్టెంబర్ 30 లోగా బ్యాంకుల్లో సబ్మి్ట్ చేసి మార్చుకోవాలని స్పష్టం చేసింది. ఒక్కొక్కరూ ప్రతి విడతలోనూ రూ.20 వేల విలువైన నోట్లు మార్చుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ నెల 23 నుంచి రూ.2000 నోటు మార్చుకోవడానికి వెసులుబాటు కల్పించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News