ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిపై సస్పెన్స్ వీడింది. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తాను బీజేపీ శాసనసభాపక్షం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. దీంతో ఢిల్లీకి మరోసారి మహిళా సీఎం పగ్గాలు చేపట్టబోతున్నారు. రేఖా గుప్తాకు ఢిల్లీ మేయర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఢిల్లీ యూనివర్సిటీ ప్రెసిడెంట్‌గా ఆమె రెండుస్తారు ఎన్నికయ్యారు. ఢిల్లీ పీఠంపురా నుంచి కౌన్సిలర్‌గా, తర్వాత మేయర్‌గా పనిచేశారు. మహిళా సీఎం రేసులో ఫ్రంట్ రన్నర్‌గా ఆమె ఉన్నారు.
రేఖా గుప్తాకు గతంలో ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేసిన అనుభవం లేదు. కానీ రాజకీయంగా ఆమెకు సుదీర్ఘ అనుభవం ఉంది. విద్యార్థి నాయకురాలిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆమె పితంపుర, షాలీమార్ బాగ్ ప్రాంత ప్రజలకు బాగా పరిచయం. స్థానికంగా పార్కుల అభివృద్ధికి ఆమె ఎంతగానో కృషిచేశారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండేవారు. రేఖాగుప్తా కుటుంబానికి సంఘ్ నేపథ్యం ఉండటం ఆమెకు కలిసొచ్చింది. విద్యార్థి దశలో ఏబీవీపీలో చురుకైన పాత్ర పోషించిన ఆమె ఆ తర్వాత బీజేపీలో చేరారు. రేఖా గుప్తా సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.