Inidan Railway EMployees: రైల్వే ఉద్యోగులకు భారతీయ రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు, వారి కుటుంబాలకు భారీ మొత్తంలో బీమా రక్షణ కల్పించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమక్షంలో దీనికి సంబంధించిన ఒప్పందం కుదిరినట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఆ రైల్వేశాఖ రిలీజ్ చేసిన ప్రకటన ప్రకారం.. ఎస్‌బీఐలో శాలరీ అకౌంట్ ఉన్న ఉద్యోగులు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.కోటి ప్రమాద బీమా కవరేజీని పొందనున్నారు. అంతేకాదు ఎస్‌బీఐ శాలరీ అకౌంట్లు కలిగిన రైల్వే ఉద్యోగులు రూ. 10 లక్షల సహజ మరణ బీమాకు కూడా అర్హులే. ఎటువంటి ప్రీమియం చెల్లింపులు లేదా వైద్య పరీక్షలు లేకుండా ఈ బీమా వర్తిస్తుంది.
అదనపు బెనిఫిట్లు
ఉద్యోగులు విమాన ప్రయాణాల్లో మరణిస్తూ రూ.1.6 కోట్ల ప్రమాద బీమాతో పాటు రూపే డెబిట్ కార్డు మీద మరో రూ. కోటి అదనంగా అందించనున్నారు. ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడితే రూ.80 లక్షల వరకు బీమా వర్తించనుంది.
ALSO READ: https://teluguprabha.net/national-news/karnataka-mla-alleges-team-members-of-dk-joing-bjp/
కాగా, రైల్వేలో దాదాపు ఏడు లక్షల మంది ఉద్యోగులకు జీతాలు ఎస్‌బీఐ ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. ఈ ఒప్పందం రూ.కోటి ప్రమాద బీమా కవర్‌తోపాటు పలు బీమా రక్షణలను కూడా అందిస్తుంది. వీటిలో రూ.1.60 కోట్ల విమాన ప్రమాద మరణ కవరేజీ మొదలైనవి ఉన్నాయి. భారతీయ రైల్వేలకు వెన్నెముకగా ఉన్న శ్రామిక శక్తికి మద్దతు ఇచ్చేందుకే ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
కాగా ఉద్యోగులకు ఏ,బీ,సీ కేటగిరీల కింద రూ. 1.20 లక్షలు, రూ.60వేలు, రూ. 30 వేలు మాత్రం ఇన్సూరెన్స్ కవరేజీ ఉండేది.
అయితే ప్రస్తుతం కల్పిస్తున్న విమాన ప్రయాణాల్లో మరణిస్తే అందించే బీమా సౌకర్యాలు ఉద్యోగులు తీసుకునే డెబిట్ కార్డులపై ఆధారపడి ఉండనుంది. ఎస్‌బీఐ గోల్డ్ (మాస్టర్ కార్డు/వీసా) , ఎస్‌బీఐ ప్లాటినం (మాస్టర్ కార్డు/వీసా), ఎస్‌బీఐ ప్రైడ్ (బిజినెస్) (మాస్టర్ కార్డు/వీసా), ఎస్‌బీఐ ప్రీమియం (బిజినెస్) (మాస్టర్ కార్డు/వీసా) , ఎస్‌బీఐ ప్రీమియం సిగ్నేచర్ (బిజినెస్) (మాస్టర్ కార్డు/వీసా) వంటి డెబిట్ కార్డులు అందిస్తోంది. ఈ కేటగిరీల వారీగా ఎంచుకునేదాన్ని బట్టి ఇన్సూరెన్స్ గ్రూపు మారుతుంది.
ఈ మేరకు భారత రైల్వేలు, ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐల మధ్య అవగాహన ఒప్పందం కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆధ్వర్యంలో సోమవారం కుదిరింది. ఇది ఎంప్లాయిస్‌తోపాటు వారి మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు ఎంతగానో ఉపకరించనుంది. అనుకోని సంఘటనల వల్ల జరగరానిది ఏదైనా జరిగితే ఇలాంటి భరోసా ఒకటి ఉందన్న ధైర్యం ఉంటుందని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


