Shashi Tharoor| దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో వాయు కాలుష్యం(Air Pollution) రోజురోజుకు పెరిగపోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రపంచంలోని కాలుష్య నగరాల జాబితా గణాంకాలను ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
‘‘ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారింది. ప్రమాదకర కాలుష్య కారకాలు నాలుగు రెట్లు పెరిగాయి. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. రెండో అత్యంత కాలుష్య నగరం ఢాకాతో పోలిస్తే ఢిల్లీలో ప్రమాద స్థాయి 5 రెట్లు ఎక్కువగానే ఉంది. నవంబరు నుంచి జనవరి మధ్య ఈ నగరంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. దీనిపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇలాంటి పరిణామాల మధ్య ఢిల్లీని ఇంకా దేశ రాజధానిగా కొనసాగించాలా?’’ అని ప్రశ్నించారు.
కాగా దీపావళి పండుగ తర్వాత నమోదైన ఏక్యూఐ(AQI) మరింత దారుణంగా పడిపోయింది. శీతాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రతిరోజూ గాలి నాణ్యత సూచీ 400కు పైగానే నమోదవుతోంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ ఒకటిగా మారింది.