వారం రోజులుగా సస్పెన్షన్ కు గురైన సభ్యుల సంఖ్య మరింత పెరిగి, ఈరోజు 146కు చేరుకుంది. ఈరోజు మరో ముగ్గురు సభ్యులు సస్పెండ్ అయ్యారు. కాగా ఇప్పటి వరకు సస్పెండ్ అయిన పార్లమెంట్ సభ్యులంతా వీధుల్లోకెక్కి, ప్లక్కార్డులతో, ఢిల్లీ ప్రధాన వీధుల్లో భారీగా ర్యాలీ నిర్వహించారు.
- Advertisement -
పార్లమెంట్ పై దాడి జరగడంపై హోం మంత్రి సభలో ప్రకటన చేయాలంటూ లోక్సభ, రాజ్యసభలో నిరసనకు దిగుతున్న విపక్ష సభ్యులందరినీ సర్కారు సస్పెండ్ చేస్తోంది. ఈరోజు పార్లమెంట్ హౌస్ నుంచి విజయ్ చౌక్ వరకూ నిరసనకు దిగటం విశేషం.
అయితే సర్కారును, రాజ్యాంగ పదవిలో ఉన్న పెద్దలందరినీ విపక్ష పార్టీలు మిమిక్రీ చేసి, అపహాస్యం చేసి, అగౌరవపరుస్తున్నారని కేంద్రం నిప్పులు చెరిగింది.