Tejashwi Yadav Dances, Makes Reels With Youngsters: సాధారణంగా రాజకీయ నాయకులు ఎప్పుడూ సీరియస్‌గానే ఉంటారని మనం భావిస్తాం. కానీ యువతతో కలిసి స్టెప్పులేస్తూ, సోషల్ మీడియా రీల్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నాయకుడు తేజస్వి యాదవ్. ఆయన ఈ సరదా మూమెంట్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ALSO READ: PM Modi : సెమీకండక్టర్లపై ప్రపంచ సమరం.. ఢిల్లీ వేదికగా భారత్ వ్యూహం!
పాట్నాలో జరిగిన ‘వొటర్ అధికార్ యాత్ర’ ముగింపు సందర్భంగా ఈ సంఘటన జరిగింది. యాత్ర ముగిసిన తర్వాత తేజస్వి యాదవ్ తన మేనల్లుడితో కలిసి పాట్నాలోని మెరైన్ డ్రైవ్‌కు వెళ్లారు. అక్కడ కొంతమంది యువ కళాకారులు సోషల్ మీడియా కోసం వీడియోలు, రీల్స్ చేస్తూ కనిపించారు. వారిని చూసిన తేజస్వి, వారితో కలిసి సరదాగా గడిపారు. యువకులు కోరడంతో వారి డ్యాన్స్‌లో భాగమయ్యారు.
తేజస్వి తన డ్యాన్స్ వీడియోను ఆయన సోదరి రోహిణి ఆచార్య సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో తేజస్వి యువకులతో కలిసి బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ స్టెప్పులను అనుకరించారు. అంతేకాకుండా, తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను కీర్తించే భోజ్‌పురి పాట ‘లాలూ బినా చాలూ ఈ బీహార్ నా హోయి’కి కూడా డ్యాన్స్ చేశారు.
गर्मी, बारिश और उमस के बीच कल 16 दिनों तक चली वोटर अधिकार यात्रा समाप्त हुई। रात्रि में सिंगापुर से आए भांजे ने कहा ड्राइव पर चले।
रास्ते में सड़क पर कुछ युवा साथी कलाकार मिले। वो गाना गा रहे थे, रील्स बना रहे थे। आग्रह करने लगे तो हमने भी हाथ-पैर आजमाए।
हम सब सहजता, सरलता और… pic.twitter.com/buNCqKnA3G
— Tejashwi Yadav (@yadavtejashwi) September 2, 2025
ఈ వీడియోలో యువకులు “తేజస్వి భయ్యా జిందాబాద్” అంటూ నినాదాలు చేయడం కనిపించింది. తేజస్వి కూడా వారితో నడుస్తూ, మధ్యలో పోలీసు అధికారులతో కూడా మాట్లాడారు. రోడ్డు పక్కన యువకులతో కలిసి టీ తాగుతూ, పాటలు పాడుతూ, వారిని ఉత్సాహపరిచారు. మొదటిలో డ్యాన్స్ స్టెప్పులు వేయడానికి కాస్త ఇబ్బంది పడినా, యువకుల సహకారంతో వాటిని త్వరగా నేర్చుకుని అలవోకగా డ్యాన్స్ చేశారు.
ALSO READ: India Immigration Act 2025 : విదేశీయులపై కేంద్రం కొరడా.. నేర చరిత్ర ఉంటే భారత్లోకి నో ఎంట్రీ!
ఈ అనుభవం గురించి తేజస్వి యాదవ్ X (ట్విట్టర్)లో ఒక పోస్ట్ కూడా చేశారు. “తేలికగా, సరళంగా, మనోహరంగా.. మనం యువత ఆశలు, ఆశయాలు, కలల కోసం నిలబడతాం. కులం, మతాలకు అతీతంగా ప్రభుత్వం మారితేనే కొత్త బీహార్ నిర్మాణం సాధ్యమవుతుంది” అని ఆయన రాశారు. ఈ సంఘటన తేజస్విలోని యువ నాయకుడిని, ప్రజలకు మరింత దగ్గరయ్యేలా చేసింది.
ALSO READ: Modi : మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా తీవ్ర స్పందన


