Sunday, October 6, 2024
Homeనేషనల్Tax Officer: ప్రభుత్వ ఆఫీస్ క్లీనింగ్ కు వచ్చిన పనిమనిషికి అధికారి ముద్దు

Tax Officer: ప్రభుత్వ ఆఫీస్ క్లీనింగ్ కు వచ్చిన పనిమనిషికి అధికారి ముద్దు

- Advertisement -

Tax Officer: ఓ కక్కుర్తి ఆఫీసర్ ఆఫీసులో క్లీనింగ్ కోసం వచ్చిన పనిమనిషి మీదే కన్నేశాడు. ఇన్‌కం ట్యాక్స్ కార్యాలయంలో పనిచేసే ఓ పనిమనిషికి బలవంతంగా ముద్దుపెట్టాడు ఓ ఉన్నతాధికారి. ఉదయమే తన ఛాంబర్ క్లీనింగ్ చేసేందుకు వచ్చిన పనిమనిషిని అప్పటికే ఆఫీసుకు వచ్చిన ఆఫీసర్ ఎవరు లేకుండా చూసి ఆమెని కౌగిలించుకుని బలవంతంగా ముద్దు పెట్టాడు. ఆమె ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

తమిళనాడులోని నుంగం బాక్కంలో గల ఆదాయపు పన్నుల శాఖ కార్యాలయంలో 36 ఏళ్ల గాబ్రియేల్ ఫ్రాంక్టన్ సీనియర్ ట్యాక్స్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇదే కార్యాలయంలో భర్తను కోల్పోయిన ఓ మహిళ ఐదేళ్లుగా పనిమనిషిగా పని చేస్తోంది. ఆమె ఎప్పటిలాగే డిసెంబర్‌ 14న సీనియర్‌ ట్యాక్స్ ఆఫీసర్‌ గాబ్రియేల్ గదిని శుభ్రం చేసేందుకు వెళ్లింది. ఈ క్రమంలోనే ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు బలవంతంగా ముద్దుపెట్టాడు. అతడు ఇబ్బంది పెడుతున్నాడని ఉన్నతాధికారులకు చెప్పినా వారు పట్టించుకోలేదు.

దీంతో ఎవరికి చెప్పినా వినకపోవడంతో స్థానిక నుంగం బాక్కం పోలీస్ స్టేషన్‌లో అధికారి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేసింది. గాబ్రియేల్ తన మొబైల్ ఫోన్‌లో నిరంతరం బెదిరించేవాడని కూడా ఆమె చెప్పగా.. అతడి వేధింపులు భరించలేక 15 తేదీన ఆత్మహత్యాయత్నం కూడా చేసుకుంది. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు గాబ్రియేల్‌ను అరెస్టు చేయగా.. ఈ ఘటన నుంగం బాక్కం అన్నా నగర్‌లో హాట్ టాపిక్ గా మారింది

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News