Saturday, November 15, 2025
HomeTop StoriesBihar Elections: బిహార్ తొలి దశ పోలింగ్ ప్రారంభం.. బరిలో ఎంత మంది అంటే?

Bihar Elections: బిహార్ తొలి దశ పోలింగ్ ప్రారంభం.. బరిలో ఎంత మంది అంటే?

Bihar First phase polling updates: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత పోలింగ్ ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఉదయం 6:30 గంటలకు ఆయా పార్టీ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించిన అనంతరం.. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తం 243 స్థానాలకు గాను తొలి దశలో 18 జిల్లాల పరిధిలోని 121 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. క్యూలో ఉన్న ఓటర్లకు 5 గంటల తర్వాత కూడా ఓటు వేసే అవకాశం కల్పించనున్నట్లు ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.

- Advertisement -

తొలిసారి ఓటేయనున్న 10.72 లక్షల మంది యువకులు: ఈ తొలి దశ పోలింగ్‌లో 3.75 కోట్ల బిహార్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 10.72 లక్షల మంది కొత్త ఓటర్లు మొదటిసారిగా ఓటు వేయనున్నట్టుగా ఎన్నికల అధికారులు తెలిపారు. దీంతో నేడు 1,314 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. తొలి దశ పోలింగ్ కోసం ఎన్నికల అధికారులు 45,341 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలి విడత ఎన్నికల్లో బరిలో ఉన్న ప్రముఖ అభ్యర్థులలో మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి, ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్ (రఘుపూర్), డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌదరి (బీజేపీ), మాంగల్ పాండే (సీవాన్) వంటి ముఖ్య నేతలు ఉన్నారు. గాయని మైథిలీ ఠాకూర్ వంటి ప్రముఖులు సైతం పోటీ పడుతున్నారు.

Also Read:https://teluguprabha.net/national-news/bihar-assembly-election-first-phase-polling/

తొలి విడత పోలింగ్‌ జరిగే జిల్లాలు: వైశాలి, ఖగారియా, బెగుసరాయ్, ముంగేర్, లఖీసరాయ్, షేక్‌పురా, నలంద, పట్నా, భోజ్‌పుర్, బక్సర్, గోపాల్‌గంజ్, సివాన్, సరణ్, ముజఫర్‌పుర్, దర్భంగా, సమస్తీపుర్, మాధేపుర, సహర్స.

ఎన్నికల కమిషన్ చర్యలు: తొలి దశ పోలింగ్ సందర్భంగా ఎన్నికల కమిషన్ భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను కఠినంగా అమలు చేస్తోంది. ఓటర్లు ఈపీఐసీ వెబ్‌సైట్ లేదా వోటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా తమ పోలింగ్ బూత్ వివరాలను తనిఖీ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. రాజకీయ సమీకరణాలు: ఈ ఎన్నికల్లో గెలుపుపై ఎన్‌డీఏ (బీజేపీ, జేడీయూ) మరియు మహాగఠ్‌బంధన్ (ఆర్‌జేడీ, కాంగ్రెస్) కూటములు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ స్థాపించిన జన్ సురాజ్ పార్టీ మొదటిసారి ఎన్నికల బరిలోకి దిగింది. దీంతో ఆ పార్టీ సైతం .. ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నవంబర్ 11న రెండో విడత పోలింగ్‌ జరుగనుంది. నవంబర్ 14న కౌంటింగ్ ప్రక్రియ చేపట్టి విజేతలను ప్రకటిస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad