నీళ్ల లోపల ఉండే ఫిష్ మ్యూజియం చూస్తే భలే మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇలాంటి వింతైన ప్రపంచం ఎవరికైనా ఆసక్తిగానే ఉంటుంది. కానీ మనదేశంలో ఇలాంటి భారీ అండర్ వాటర్ ఫిష్ మ్యూజియంలు లేవు. ఫారిన్ టూర్స్ లోనే ఇలాంటివి చూసే ఛాన్స్ ఉంటుంది.
- Advertisement -
ఇండియాలో మొదటిసారి అండర్ వాటర్ ఫిష్ మ్యూజియం అందుబాటులోకి వచ్చింది. బెంగళూరులో లేటెస్ట్ గా వచ్చిన ఈ లేటెస్ట్ అట్రాక్షన్ చూసేందుకు జస్ట్ 100 రూపాయల టికెట్ కొంటే చాలు. జేపీ నగరలోని ఈ టన్నెల్ అక్వేరియం చాలా అట్రాక్టివ్ గా ఉంది. ప్రతి రోజూ ఈ మ్యూజియంను ఓపన్ చేసి పెడతారు. కాబట్టి మీరు ఉదయం నుంచి సాయంత్రం లోగా ఎప్పుడైనా ఈ భారీ అక్వేరియంను చూసి ఎంజాయ్ చేయచ్చు. నెక్ట్స్ టైం మీ బెంగళూరు ట్రిప్ లో ఈ టన్నెల్ అక్వేరియం ప్లాన్ చేసుకోండి.