Thursday, September 19, 2024
Homeనేషనల్Viral video : క‌వ‌ల సోద‌రీమ‌ణుల‌ను పెళ్లి చేసుకున్న యువ‌కుడు

Viral video : క‌వ‌ల సోద‌రీమ‌ణుల‌ను పెళ్లి చేసుకున్న యువ‌కుడు

Viral video : సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని ఎక్క‌డ ఏం జ‌రిగినా క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతోంది. కొన్ని వీడియోలు ఫ‌న్నీగా ఉంటే మ‌రికొన్ని ఆలోచ‌న రేక్తెతించేలా ఉంటాయి. ఇంకొన్ని ఇవేం వీడియోలురా బాబు అన్న చందంగా ఉంటాయి. మ‌న దేశంలో పెళ్లి కాని బ్ర‌హ్మ‌చారులు చాలా మంది ఉన్నారు. పెళ్లి చేసుకునేందుకు ఒక్క అమ్మాయి కూడా దొర‌క‌డం లేద‌ని వాళ్లు ఏడుస్తుంటే వీడెవడో న‌క్క తోక తొక్కిన‌ట్లు ఉన్నాడు. ఇద్ద‌రు అమ్మాయిలు(క‌వ‌ల‌ల‌ను) పెళ్లి చేసుకున్నాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ గా మారింది.

- Advertisement -

పింకీ, రింకీ అనే ఇద్ద‌రు క‌వ‌ల‌లు ముంబైలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ప‌ని చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం వీరి తండ్రి మ‌ర‌ణించ‌గా త‌ల్లితో క‌లిసి ఉంటున్నారు. వీరి నివాసానికి స‌మీపంలోనే మ‌హారాష్ట్ర షోలాపూర్ జిల్లాలోని అక్లూజ్ గ్రామానికి చెందిన అకుల్ నివ‌సిస్తున్నాడు. అత‌డు ట్రావెల్ బిజినెస్ చేస్తుంటాడు.

కొద్ది రోజుల క్రితం క‌వ‌ల‌ల త‌ల్లి అనారోగ్యం పాలైంది. ఆమెను అకుల్ త‌న కారులో ఆస్ప‌త్రికి తీసుకువెళ్లాడు. ఆ యువ‌కుడితో అప్ప‌టి నుంచి పింకీ, రింకీకి ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అది స్నేహంగా మారి చిర‌వ‌కు ప్రేమ‌గా విర‌బూసింది. ఈ క్ర‌మంలో ఆ కవల సోదరీమణులు అత‌డిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. ఇందుకు ఇరు కుటుంబాలు అంగీక‌రించారు. దీంతో అకుల్‌.. పింకీ, రింకీ మెడ‌లో తాళి క‌ట్టాడు. ఇద్దరు వధువులు ఒకే పూల దండను వరుడి మెడలో వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News