పార్లమెంట్‌లో మరికాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) 2025-26 వార్షిక బడ్జెట్ (Union budget 2025)ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో ఉదయం 9 గంటలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి నేరుగా రాష్ట్రపతి భవన్‌కు ఆమె వెళ్లారు. ఈ సందర్భంగా సాంప్రదాయ ‘బాహీ ఖాతా’కి బదులుగా 2025 బడ్జెట్‌ను ట్యాబ్ రూపంలో తీసుకెళ్తున్నట్లు మీడియాకు చూపించారు. అలాగే ఆమె కట్టుకున్న చీర గురించి చర్చ జరుగుతోంది.
బిహార్ మధుబని కాంతా వర్క్ చీర
ఈ చీరపై బీహార్‌కు చెందిన మధుబని కళకు సంబంధించిన చిత్రాలను ముద్రించి ఉన్నాయి. 2021 పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారి దేవి (Dulari Devi)ఈ చీరను నిర్మలమ్మకు ఇచ్చినట్లు తెలుస్తోంది. మధుబని కళకు గుర్తుగా ఆమె ఈ చీర కట్టుకున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో దులారి దేవి తాను తయారు చేసిన చీరను సమర్పించి, బడ్జెట్ రోజున దాన్ని ధరించమని నిర్మలమ్మను కోరింది. దులారి కోరిక మేరకు నిర్మలా సీతారామన్ ఇప్పుడు ఆ చీరను కట్టుకోవడం విశేషం.
చేత్తో వేసే ఆర్టే మధుబని
బిహార్ లోని మిథిలా ప్రాంతం ఈ చీరలకు ప్రఖ్యాంతిగాంచింది. ఇవి చేనేత వస్త్రాలు. మధుబని పెయింటింగ్స్ ను కాటన్, పట్టు చీరల మీద చేత్తో వేస్తారు. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు నిర్మలమ్మ ఈరోజు హాఫ్ వైట్ మధుబని చీరలో కనిపించారు. బంగారు జరీ ఉన్న ఈ చీరపై ఫిష్ థీమ్డ్ ఎంబ్రాయిడరీ స్పెషల్ అట్రాక్షన్ గా ఆకట్టుకోవటం విశేషం.