Upasana: సనాతన ధర్మంలోనే జాలి, దయ ఉంటుందని తన తాతయ్య ఎప్పుడూ చెబుతుండేవారని గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్(Ramcharan) సతీమణి ఉపాసన తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అయోధ్య రామమందిరం ప్రాంగణంలో అపోలో హాస్పిటల్స్ (Apollo Hospitals) తరుఫున ఉచిత అత్యవసర వైద్య సేవలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు హజరువుతున్నారని పేర్కొన్నారు.
భక్తులు ఎవరూ అనారోగ్యంతో ఇబ్బందులు పడకుండా సకాలంలో వారికి మెరుగైన వైద్య సేవలను అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే తిరుమల, శ్రీశైలం, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లలో అపోలో సెంటర్లు కొనసాగుతున్నాయని.. ఇప్పుడు రామ జన్మభూమిలో ప్రారంభించడం సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. ఇందులో తమకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పారు.