భారత్–పాకిస్తాన్ సరిహద్దు ఉద్రిక్తతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇటీవల పహల్గాం వద్ద ఉగ్రదాడి, ఆపై భారత సైన్యం చేపట్టిన ప్రతిచర్య “ఆపరేషన్ సిందూర్”తో గరిష్టస్థాయికి చేరిన ఉద్రిక్తతల నేపథ్యంలో, శనివారం రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినది. ఈ పరిణామం కేవలం భారతదేశం, పాకిస్తాన్ పరిమితంగా కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ నేతల చర్చకు దారి తీసింది.
ఈ ఒప్పందానికి అమెరికా కీలక పాత్ర పోషించిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా భారత్, పాకిస్తాన్ మధ్య శాంతి సాధన కోసం తాము మధ్యవర్తిత్వం వహించామని తెలిపింది. ఇరు దేశాలతో సుదీర్ఘ చర్చల అనంతరం కాల్పుల విరమణ సాధ్యమైందని వ్యాఖ్యానించారు. ఈ ప్రక్రియలో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ప్రత్యేకంగా ముందుండి పనిచేసినట్లు తెలుస్తోంది.
ఈ కాల్పుల విరమణలో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం గురించి చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీ, జేడీ వాన్స్‌తో మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఒకవేళ భారతదేశంపై దాడి చేస్తే, తీవ్రంగా దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేసినట్లు ఆదివారం ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
కాశ్మీర్ విషయంలో భారత వైఖరి స్పష్టంగా ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ నుంచి పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)ని తిరిగి తీసుకువడం మిగిలి ఉందని చెప్పినట్లు, పాకిస్తాన్ టెర్రరిస్టుల్ని అప్పగించాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.భారత్-పాక్ మధ్య ఎవరూ మధ్యవర్తిత్వం వహించాలని భారత్ కోరుకోవడం లేదని మోడీ అన్నారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని, మనం కొత్త సాధారణ స్థితిలో ఉన్నామని ఆయన చెప్పారు. ప్రపంచం, పాకిస్తాన్ దీనిని అంగీకరించాలని చెప్పినట్లు తెలుస్తోంది.