Friday, November 22, 2024
Homeనేషనల్Uttarakasi Tunnel Rescue operation successfull: ఎట్టకేలకు సురక్షితంగా బయటకు వచ్చిన 41 మంది

Uttarakasi Tunnel Rescue operation successfull: ఎట్టకేలకు సురక్షితంగా బయటకు వచ్చిన 41 మంది

దేశీ పరిజ్ఞానంతో ..

సొరంగంలో చిక్కుకుపోయిన కూలీలందరినీ సురక్షితంగా బయటికి తెచ్చారు. వారంతా ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారు. ర్యాట్ హోల్ మైనింగ్ ద్వారా 17 రోజులుగా సొరంగంలో చిక్కుకున్న కూలీలందరినీ బయటికి తెచ్చారు. నవంబర్ 12వ తేదీన నాలుగున్నర కిలోమీటర్ల మేర ఉన్న బ్రహ్మకాల్-యమునోత్రి నేషనల్ హైవే ఉన్నట్టుండి కుప్పకూలటంతో సొరంగం తవ్వకాల పనుల్లో నిమగ్నమై ఉన్న 41 మంది కూలీలు చిక్కుకుపోయారు. చార్ దాంకు 200 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న రోడ్ కనెక్టివిటీ పనుల్లో భాగంగా ఈ సొరంగ నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఉత్తరకాశీలో ఈ పనులన్నీ పూర్తీ అయితే చార్ దాంకు వెళ్లటం మరింత సులువు కానుంది. దీంతో ఈ పనులను మోడీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

- Advertisement -

గత 17 రోజులుగా ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలు సురక్షితంగా బయటికి వచ్చే అవకాశం ఉంది. మరో 2 మీటర్ల దూరంలో రెస్క్యూ ఆపరేషన్స్ సాగుతున్నాయి. ర్యాట్ హోల్ మైనర్ల ఆధ్వర్యంలో తవ్వకాలను జాగ్రత్తగా చేపడుతున్నారు. 2 మీటర్ల వరకు ఇక సొరంగం తవ్వకాలున్నాయని, ఈ పని పూర్తికాగానే ముందు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు లోపలికి వెళ్లి ఆతరువాత కూలీలను బయటికి తీసుకురానున్నారు. ఇప్పటికే కూలీల కుటుంబ సభ్యులను ఇక్కడికి రప్పించారు. హెలిక్యాప్టర్లను అందుబాటులో పెట్టారు. తాత్కాలిక ఆసుపత్రిని టన్నెల్ వద్దనే ఏర్పాటు చేశారు. 400 గంటలకుపైగా కూలీలు చిక్కుకుపోయారు. వీరు సురక్షితంగా బయటికి రావాలని పూజలు సాగుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News