Saturday, September 21, 2024
Homeనేషనల్Varanasi: ప్రారంభమైన కాశి బెలూన్ అండ్ బోట్ ఫెస్టివల్

Varanasi: ప్రారంభమైన కాశి బెలూన్ అండ్ బోట్ ఫెస్టివల్

వారణాసిలో సరికొత్త ఫెస్టివల్ స్టార్ట్ అయింది. ఉత్తరప్రదేశ్ టూరిజం ఆధ్వర్యంలో బెలూన్ అండ్ బోట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. జనవరి 17 నుంచి 4 రోజులపాటు ఈ బెలూన్ అండ్ బోట్ ఫెస్టివల్ సాగనుంది. బోట్ రేసింగ్, హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్ ఫెస్టివల్ లో రేసులు జరుగుతున్నాయి. దీన్ని కాశి బెలూన్ అండ్ బోట్ ఫెస్టివల్ గా పిలుస్తున్నారు.

- Advertisement -

నమో ఘాట్స్ నుంచి దశాశ్వమేధ ఘాట్స్ మధ్య ఈ బోట్ రేసింగ్ సాగనుంది. వీటితో పాటు పారామోటర్స్ రైడ్స్ కూడా అట్రాక్షన్ గా నిలువనున్నాయి. 2021లో కూడా ఇలాంటి పోటీలు భారీ ఎత్తున నిర్వహించగా అంతర్జాతీయ ఔత్సాహికులు కూడా పార్టిసిపేట్ చేశారు. ప్రస్తుతం రెండవసారి హాట్ ఎయిర్ బెలూన్ పోటీలు ఇక్కడ జరుగుతుండటం విశేషం కాగా.. అమెరికా, జపాన్, కెనడా ఏజెన్సీలు ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఉత్సవాలకు టెక్నికల్ సపోర్ట్ చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News