ప్రజాస్వామ్యంలో పవిత్రమైన గుడిగా భావించే పార్లమెంట్ పై దాడి సంచలనం సృష్టిస్తోంది. అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్ లో సరిగ్గా 22 ఏళ్ల క్రితం పార్లమెంట్ పై దాడి జరగ్గా అదేరోజు మళ్లీ నలుగురు దుండగులు దాడికి విఫల యత్నం చేయటం సెన్సేషన్ గా మారింది.
దుండగులు పార్లమెంట్ లోపల, బయట కలర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో అసలు కలర్ గ్యాస్ అంటేం ఏంటనే విషయంపై అందరూ చర్చించుకుంటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే టైంలో నాటి కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రేను పార్లమెంట్ లోపల ప్రయోగించారు. ఆతరువాత ఈరోజు ఇలా కలర్ గ్యాస్ ప్రయోగించారు.
విజిటర్స్ పాస్ తో పార్లమెంట్ లోపలికి వచ్చి విజిటర్స్ గ్యాలరీలో కూర్చొన్న వ్యక్తి ఉన్నట్టుండి ఎంపీలపై దూకి, ఆతరువాత స్మోక్ బాంబ్ విసరటం పార్లమెంట్ సెక్యూరిటీపై విమర్శలకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో స్మోక్ బాంబ్స్ లేదా స్మోక్ క్యాన్స్ అంటే ఏమిటనేది ఆసక్తిగా మారింది.
ఈ కలర్ గ్యాస్ లు లీగలే ఎందుకంటే?
పలు దేశాల్లో ఈ కలర్ గ్యాస్ కానిస్టర్స్ చట్టబద్ధమే. ఎందుకంటే ఫోటోగ్రఫీ ఎఫెక్ట్స్ కోసం, సెలబ్రేషన్స్ కోసం, ఎవాక్యుయేషన్ పాయింట్స్ కోసం ఈ గ్యాస్ క్యాన్స్ వాడతారు. అందుకే స్మోక్ బాంబ్స్ బహిరంగ మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి కూడా. మిలిటరీతో పాటు సాధారణ పౌరులు కూడా వీటిని కొని, ప్రయోగించవచ్చు.
స్పోర్ట్స్ ఈవెంట్స్ లో షాంపైన్ లానే ఈ స్మోక్ క్యాన్స్ ను తరచూ ఉపయోగించటం కామన్. ఫుట్ బాల్ లో అయితే ఈ స్మోక్ కానిస్టర్స్ ను తప్పకుండా ఉపయోగిస్తుంటారు. ఫుట్ బాల్ క్లబ్స్ తమతమ క్లబ్స్ కలర్స్ ను చూపేలా ఈ కలర్డ్ స్మోక్ క్యాన్స్ వాడటం పరిపాటి. యూరోపియన్ ఫుట్ బాల్, ఫ్యాన్ క్లబ్స్ తరచూ ఈ క్యాన్స్ వాడతారు. టీముల్లో జోష్ నింపడానికి ఫ్యాన్స్ ఇలాంటి పనులు చేస్తుంటారు.
ఎయిర్ స్ట్రైక్స్ టైంలో మార్కింగ్ టార్గెట్ గా ఇలాంటి స్మోక్ క్యాన్స్ ఉపయోగిస్తారు. ట్రూప్ ల్యాండింగ్, ఎవాక్యుయేషన్ పాయింట్స్ గా ఈ పొగను మిలిటరీ ఆప్స్ లో సింబాలిక్ గా ప్రయోగిస్తారన్నమాట.