Monday, April 21, 2025
Homeనేషనల్Missing Wife: వైఫ్ మిస్సింగ్.. కట్ చేస్తే తాజ్ మహల్ ముందు..!

Missing Wife: వైఫ్ మిస్సింగ్.. కట్ చేస్తే తాజ్ మహల్ ముందు..!

తన భార్య కనిపించకుండా పోవడంతో ఓ వ్యక్తి ఆందోళన చెందాడు.. ఇంటి దగ్గర వెతికాడు ఎక్కడా కనిపించలేదు. ఎవరైనా కిడ్నాప్ చేశారా అని భయ పడ్డాడు. కొందరైతే అతడే ఏదో చేశాడని అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులకు కూడా కంప్లైంట్ చేశాడు. కానీ చివరికి తానే మోసపోయినట్టు తెలిసి తల పట్టుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
అలీఘర్‌లో నివసించే షకీర్ అనే వ్యక్తి ఏప్రిల్ 25న ఇంటికి వచ్చేసరికి ఒక షాక్ ఎదురైంది. ఇంటికి తాళం వేసి ఉంది. లోపల అతని భార్య అంజుమ్, నలుగురు పిల్లలు ఎక్కడా కనిపించలేదు. దీంతో భయంతో ఎవరికి చెప్పాలో తెలియక, చివరికి పోలీసులను ఆశ్రయించాడు. మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది.

- Advertisement -

అయితే పోలీసులు అసలు నిజం వేరే ఉంది. ఇంటి పక్కవాళ్ల మాటల ప్రకారం, అంజుమ్ ఇంట్లోని విలువైన వస్తువులను తీసుకొని ఎవరికీ తెలియకుండా వెళ్లిపోయింది. ఇది షకీర్‌కు మొదటి సంకేతం. ఆ తరువాత రోజుల్లో తన బంధువు పంపిన ఓ ఫోటో చూసి షాక్ అయ్యాడు. ఆ ఫోటోలో అంజుమ్ తన ప్రేమికుడితో కలిసి తాజ్ మహల్ ముందు నవ్వుతూ కనిపిచింది.

ఇంతవరకూ ఆవిడను ఎవరైనా కిడ్నాప్ చేశారని అనుమానించిన షకీర్‌కు అప్పుడే అసలు విషయం అర్థమైంది. ఆమె మాయం కాలేదు. ఉద్దేశపూర్వకంగానే వెళ్లిపోయింది. ముఖ్యంగా ఆమె లవర్‌ కూడా షకీర్‌ పని చేసే చోటే ఉద్యోగిగా పని చేస్తున్నాడని తెలిసి అతను అవాక్కయ్యాడు. ఈ ఘటనపై రోరావర్ పోలీస్ స్టేషన్‌కి షకీర్ చేసిన ఫిర్యాదు ఆధారంగా అలీఘర్ పోలీసులు, ఆగ్రా పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం అంజుమ్‌, ఆమె లవర్ కోసం గాలింపు కొనసాగుతోంది. భార్య కోసం ఆందోళన పడిన భర్తకు చివరికి ఎదురైన ఈ నిజం తెలిసి బాధపడుతున్నాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News