Viral Video : మనిషి జీవితం ఓ బుడగ వంటిదని అంటుంటారు. ఏ క్షణంలో మృత్యువు ఎటువైపు నుంచి వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. అప్పటి వరకు అందరితో ఎంతో ఆనందంగా ఉంటారు. చూడడానికి ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించవు. అయితే.. గుండెపోటుతో ఉన్నట్లుండి కుప్పకూలి క్షణాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోతారు. ఇటీవల కాలంలో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఓ మహిళ పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలోని బఖారీ గ్రామంలో ఓ వివాహ వేడుకకు 60 ఏళ్ల మహిళ వెళ్లింది. బంధువులతో కలిసి ఎంతో ఉత్సాహంగా గడిపింది. తన అక్కాచెళ్లళ్లతో కలిసి స్టేజీపైన డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. బంధువులు వెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అయితే.. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. కాగా.. ఆమె గుండెపోటుతో మరణించిందని డాక్టర్ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.