Saturday, November 15, 2025
Homeనేషనల్Dharmapuri: సాంబార్ తో భర్తను బలిగొన్న భార్య..!

Dharmapuri: సాంబార్ తో భర్తను బలిగొన్న భార్య..!

Tamilnadu: ఈ మధ్య కాలంలో ఇదేదో బాగా ట్రెండ్ అయినట్టు వేరొక్క తీరులుగా భర్తలను భార్యలు హతమారుస్తున్నారు. హనీమూన్ లో ఒకరు, వాటర్ ట్యాంక్ లో మరొకరు.. ఇలా ఎవరికీ తోచినట్టు వారు తీరొక్క పద్దతిలో కట్టుకున్న భర్తలను కడతేరుస్తున్నారు. ప్రియుడి కోసం భర్తలను బలి తీసుకుంటున్నారు.

- Advertisement -

తాజాగా తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లాలోని కీరైపట్టి గ్రామానికి చెందిన రసూల్‌ (35) ని ఆతని భార్య అయిన అమ్ముబీ హతమార్చింది. రసూల్, అమ్ముబీ దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ అమ్ముబీ మరొకరితో ప్రేమలో పడి ఈ ఘాతుకానికి పాల్పడింది.

Readmore: https://teluguprabha.net/national-news/former-kerala-cm-passed-away/

రసూల్ డ్రైవర్ గా పనిచేస్తూ తన ఇంటిని పోషిస్తున్నాడు. అమ్ముబీ ఇంటి దగ్గరే ఉంటూ సమీపంలో ఉన్న లోకేశ్వరన్ అనే వ్యక్తితో ప్రేమలో పడి వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని రసూల్ ని మొదట దానిమ్మ రసంలో విషం కలిపి ఇచ్చింది. రసూల్ అది తాగకపోవడంతో అమ్ముబీ సాంబార్ లో విషం కలిపి వడ్డించింది.

అది తిన్న రసూల్‌ వాంతులు చేస్తూ స్పృహ కోల్పోవడంతో సేలంలోని ఓ ఆసుపత్రిలో కుటుంబీకులు చేర్చారు. అక్కడ వైద్య సిబ్బంది అన్ని రక్త నమూన పరీక్షలు నిర్వహించాక పురుగుమందు సేవించి మరణించినట్లు గుర్తించారు. ఇదే విషయం కుటుంబీకులతో తెలుపగా.. అమ్ముబీ పొంతన లేని సమాధానాలు చెప్పింది. దీంతో రసూల్‌ కుటుంబీకులు ఆయన భార్యపై అనుమానంతో ఆమె సెల్‌ఫోన్‌లోని వాట్సప్‌ చాటింగ్‌ పరిశీలించారు.

Readmore: https://teluguprabha.net/national-news/pm-modi-addressed-the-media-at-the-beginning-of-the-monsoon-session/

ఆమె స్థానికంగా సెలూన్‌ నడుపుతున్న లోకేశ్వరన్‌తో చాట్‌ చేసినట్లు గుర్తించారు. అందులో.. నువ్వు ఇచ్చిన విషం మొదట దానిమ్మ రసంలో కలిపా. దాన్ని నా భర్త తాగలేదు. దీంతో ఆహారంలో కలిపా అని అమ్ముబీ పేర్కొంది. ఈ క్రమంలో చికిత్స పొందుతున్న రసూల్‌ మృతి చెందారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అమ్ముబీ, లోకేశ్వరన్‌లను శనివారం అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad