అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని(Womens Day) పురస్కరించుకొని నారీశక్తికి వందనం అంటూ మహిళలకు ప్రధాని మోదీ(PM Modi) శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళా సాధికారికతకు తమ ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ సందర్బంగా ఇవాళ తన సోషల్ మీడియా ఖాతాలను మహిళలు నిర్వహిస్తారని చెప్పారు. ఇందుకు తగ్గట్లుగానే వివిధ రంగాకు చెందిన మహిళలు తమ విజయ గాథలను మోదీ ఖాతాల నుంచి పోస్టులు చేస్తున్నారు. మోదీ పిలుపునకు మహిళల నుంచి భారీ స్పందన వస్తోంది.