Friday, November 22, 2024
Homeనేషనల్Young man married Transgender : రెండేళ్ల ప్రేమ‌.. ట్రాన్స్ జెండ‌ర్‌ను పెళ్లి చేసుకున్న‌ యువ‌కుడు

Young man married Transgender : రెండేళ్ల ప్రేమ‌.. ట్రాన్స్ జెండ‌ర్‌ను పెళ్లి చేసుకున్న‌ యువ‌కుడు

Young man married Transgender : ప్రేమ అనేది ఓ అనిర్వ‌చ‌నీయ ప‌దం. ఎప్పుడు ఎవ‌రి మ‌ధ్య పుడుతుందో ఎవ్వ‌రూ చెప్ప‌లేరు. ప్రేమకి వ‌య‌స్సు, లింగ బేధం లేద‌ని అంటుంటారు. ఓ యువ‌కుడు, ట్రాన్స్‌జెండ‌ర్‌కు మ‌ధ్య ప్రేమ చిగురించింది. వారిద్ద‌రూ దాదాపు రెండు సంవ‌త్సరాల పాటు స‌హ‌జీవ‌నం చేశారు. ఇంట్లో వాళ్ల‌ను ఒప్పించి పెళ్లిచేసుకున్నారు. వీరి వివాహానికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

- Advertisement -

వీరూ రాజ్‌భ‌ర్‌(24) అనే యువ‌కుడు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అజంగ‌ఢ్ జిల్లాలో ట‌కై గ్రామ నివాసి. ఇత‌డికి రెండు సంవ‌త్స‌రాల క్రితం బ్యాండ్ పార్టీలో డ్యాన్స్ చేసేందుకు మౌకి వ‌చ్చిన ప‌శ్చిమ బెంగాల్‌లోని జ‌ల్‌పాయ్‌గుడికి చెందిన ముస్కాన్ కిన్నార్ అనే ట్రాన్స్ జెండ‌ర్ తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అది ప్రేమ‌గా మారింది. ఇద్ద‌రూ తొలి చూపుల్లోనే ఒక‌రిని ఒక‌రు ఇష్ట‌ప‌డిన‌ట్లు తెలుసుకున్నారు. కొన్నాళ్ల‌కు స‌హ‌జీవ‌నం మొద‌లుపెట్టారు.

అయితే.. ఇటీవ‌ల వీరిద్ద‌రు పెళ్లిచేసుకోవాల‌ని అనుకున్నారు. వారి ప్రేమ విష‌యాన్ని పెద్ద‌ల‌కు తెలియ‌జేశారు. ఇరు కుటుంబాల్లోని వారు వీరి పెళ్లికి అంగీక‌రించారు. బైరోధం గుడిలో శుక్ర‌వారం వీరిద్ద‌రూ వేద‌మంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి పెళ్లి వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. నీది నిజ‌మైన ప్రేమ అని ఓ నెటిజ‌న్ కామెంట్ చేయ‌గా.. ప్రేమ గుడ్డిది అంటారు బ‌హుళా అది ఇదేనేమో అంటూ మ‌రొక‌రు అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News